Saturday, April 20, 2024
- Advertisement -

క్రిప్టో కరెన్సీ బ్యాన్.. సాధ్యం కదా ?

- Advertisement -

అంతర్జాతీయ లావాదేవీలలో క్రిప్టో కరెన్సీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో చాలా రకాలే ఉన్నప్పటికి బిట్ కాయిన్ అందరికీ తెలిసిన క్రిప్టో కరెన్సీ గా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పరోక్ష లావాదేవీలపై ఈ బిట్ కాయిన్ ప్రభావం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ ని బ్యాన్ చేయాలని ఎన్నో రోజులుగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికి ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఇక భారత్ విషయానికొస్తే.. ఎప్పటినుంచో క్రిప్టో కరెన్సీ ని బ్యాన్ చేయాలని ఆర్‌బి‌ఐ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

కానీ ఇండియాలో క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టె వారి సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 వరకు ఉండవచ్చని అంచనా. దాంతో క్రిప్టో ను బ్యాన్ చేయడం అంతా తేలికగా సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయమై తాజాగా పార్లమెంట్ లో జరిగిన వర్షాకాల సమావేశాలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా శీత రామన్ కూడా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీ ల నిషేదం పై ఆర్‌బి‌ఐ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లుగా తెలిపారు. అంతర్జాతీయంగా పరోక్ష విధానంలో చలామణి లో ఉన్న క్రిప్టో కరెన్సీ ని బ్యాన్ చేయడానికి ప్రపంచ దేశాల సహకారం కూడా ఉండాలని చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ సహకారం తోనే క్రిప్టో కరెన్సీ లోని లాభనష్టాలను అంచనా వేసి నియమ్తృంచడం సాధ్యపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే క్రిప్టో కరెన్సీ ని బ్యాన్ చేయడం అంతా సులభం కాదని తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడి కూడా క్రిప్టో వాడకం వల్ల ఏర్పడే సమస్యలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ కి చెక్ పెట్టేందుకు, ఆర్‌బి‌ఐ కూడా దేశంలో డిజిటల్ కరెన్సీ ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ కి బదులుగా స్వదేశీ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

చైనా అమెరికా మద్య .. తైవాన్ చిచ్చు !

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -