గోళ్ళు కొరుకితే ఇక అంతే

- Advertisement -

గోళ్లు కొరకడమనేది చాలామందికున్న ఓ హ్యాడ్ హాబిట్.దీనిని ఏమాత్రం మార్చుదామనుకున్నా…. కుదరని అలవాటు.దాంతో చాలామందికి గోళ్లు కొరుకుతూ లేని పోని సోషల్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తుంటారు. పుస్తకం చదువ్ఞతున్నప్పుడో, టివి చూస్తున్నప్పుడో కొందరు గోళ్లు కొరుకుతుండటం చూస్తూనే ఉంటాం. మరికొందరికిది అలవాటుగానూ మారుతుంటుంది. ఇది మంచిది కాదని చెప్పినా.. ‘ ఆ గోళ్లు కొరికితే ఏమవతుందిలే అని చాలా మంది లైట్ గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి దీంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. గోళ్ల అడుగున చాలా రకాల బ్యాక్టీరియా ముఖ్యంగా.. సాల్మొనెలా, ఇ.కొలి వంటి క్రిములు దాగి ఉంటాయి.

గోళ్లను కొరికినపుడు ఇవి ముందు నోట్లోకి.. అక్కడ నుంచి పేగుల్లోకి చేరుకుంటాయి. ఇవి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఫలితంగా అతిసారం, కడుపునొప్పి వంటి సమస్యలు దాడి చేస్తాయి. దీర్ఘకాలంగా గోళ్లు కొరికే అలవాటు గలవారికి పారానైకియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఉంది. వీరి వేళ్ల చివరన చర్మం మీద పడే పంటిగాట్ల ద్వారా బ్యాక్టీరియా లేదా ఈస్ట్‌ లోపలికి ప్రవేశించి గోళ్ల కింద వాపు, చర్మం ఎర్రబడటం, చీము పోగుపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయాల్లో సర్జరీ చేసి చీమును బయటకు తీయాల్సి వస్తుంది.

- Advertisement -

యాంటీబయోటిక్‌ లేదా యాంటీఫంగల్‌ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఎక్కువే. నిరంతరం గోళ్లు కొరకటం వల్ల దంతాల ఆకారమూ దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ కూడా రావచ్చు.అందుకే గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు ఆ అలవాటును ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడేవారిలో కొందరికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు సైక్రియాటిస్ట్‌ సాయంతో దీన్నుంచి బయటపడవచ్చు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -