Thursday, May 2, 2024
- Advertisement -

దేశంలో 20 శాతం మంది రోగగ్రస్తులే

- Advertisement -

భారతదేశంలో యువతను బ్లడ్ ప్రెషర్ వేధిస్తోంది. ఏకంగా 20 శాతం మంది యువత దీని బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోగం బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య 10.8 శాతం ఉంది. ఉద్యోగాల్లో గంటల తరబడి కూర్చోవడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని సర్వేలో తేలింది.

ఈ రక్తపోటు కారణంగా యువత జీవిత కాలంలో 4.6 శాతం తగ్గిపోతోందని సర్వేలో పేర్కొన్నారు. దీని కారణంగా యువత అనేక రోగాల బారిన పడుతోందని తేలింది. ఇక మగవారి నడుం చుట్టుకొలత 90 సెంటీమీటర్లు, ఆడవారి నడుం చుట్టుకొలత 80 సెంటీమీటర్లు దాటితే రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దేశంలో ప్రతి ఏటా 11 లక్షల మంది గుండె పోటు, గుండెకు సంబంధిన వ్యాధుల కారణంగా చనిపోతున్నారని పేర్కొన్నారు. దీని నుంచి బయటపడేందుకు యువత జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వ్యాయామం చేయడం తప్పనిసరి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎసి గదుల్లో గంటల తరబడి కూర్చోకుండా మధ్య మధ్యలో తిరుగుతూ ఉండాలని కూడా సూచించారు. సాధ్యమైనంత వరకూ లిఫ్టులను ఉపయోగించకుండా మెట్ల దారిలోనే వెళ్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. యువతా.. తస్మాత్ జాగ్రత్త.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -