Thursday, May 9, 2024
- Advertisement -

జగన్ పాదయాత్ర కుర్చీ కోసమేనా…. ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదా?

- Advertisement -

వ్యక్తిత్వాన్ని ఎలా హత్య చేయాలో…. కుటుంబ సంబంధాలను కూడా రాక్షసంగా ఎలా చిత్రీకరించాలో చంద్రబాబుకు, ఆయన భజన మీడియాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. వైఎస్ కుటుంబ సభ్యులందరినీ, వైఎస్‌లను ఆదరిస్తున్నారనే నెపంతో పులివెందుల ప్రజలను, కడప వాసులను…..మొత్తంగా రాయలసీమ ప్రజలను ఏ స్థాయిలో కించపరిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు జగన్ పాదయాత్రపైన కూడా అంతా జగన్ వ్యక్తిగత స్వార్థం కోసం అని, కేసుల మాఫీ కోసమని, సిఎం కుర్చీ కోసమని రకరకాలుగా సొల్లు కబుర్లు చెప్తున్నారు. గాలి కూతలు కూస్తున్నారు. భాష ఘాటుగా అనిపించినా కొంతమంది జనాలకు చెప్పక తప్పదు. ఇక్కడ జగన్‌కి మద్ధతుగా రాయాలన్న ప్రయత్నం కూడా లేదు. అబద్ధపు రాతలతో, అభూత కల్పనలతో బూతు పత్రికలాగా కథలు అల్లడం లేదు. అవినీతి విషయం పక్కన పెడదాం. ఎందుకంటే జగన్‌పైన ఇప్పటి వరకూ ఉన్నవన్నీ ఆరోపణలే. నిరూపించిన కేసు ఒక్కటి కూడా లేదు.

ఇక చంద్రబాబు అయితే ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు. ఇక 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి బంధువుల ఇంట్లో యాభై కోట్లకు పైగా క్యాష్ ఎన్నికల అధికారులకు దొరికింది. అయినప్పటికీ అవినీతి విషయాలు వదిలేద్దాం. రాజకీయాల్లో ఎవరు విలువలు పాటిస్తున్నారో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబులానే అన్నీ ఫ్రీ హామీలు ఇచ్చి ఉంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవాడా? కాదా? ఇక ఎన్టీఆర్ నుంచి పార్టీని, సిఎం కుర్చీని లాక్కున్న చంద్రబాబు ఏనాడైనా ఫిరాయింపు నేతల చేత రాజీనామ చేయించే ధైర్యం చేశాడా? కానీ ఒక్కడిగా పార్టీని స్థాపించిన జగన్ ఇప్పటి వరకూ పదవికి రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకున్న నేత ఎవరైనా ఉన్నారా? ఒకే…ఆ విషయం కూడా పక్కన పెట్టేద్దాం. జగన్‌కి ఏదైనా ధైర్యంగా, స్ట్రెయిట్‌గా చేయడం అలవాటు. అందుకే తన సొంత మీడియా సాక్షినే తన పేరు మీదే ప్రారంభింపచేశాడు. ప్రత్యర్థుల్లాగా తెరవెనుక వ్యవహారాలతో భజన మీడియాను ఏర్పాటు చేసుకోలేదు. పవన్ కళ్యాణ్‌లాగా బాబుకు భయపడుతూ ఆయన భజన మీడియా సపోర్ట్ తీసుకునే ప్రయత్నాలు కూడా ఎప్పుడూ చేయలేదు.

ఆ విషయాలన్నీ పక్కన పెడితే జగన్‌పై ప్రత్యర్థులు చేసే ఒక ప్రధాన ఆరోపణ……కుర్చీ కోసమే అన్నీ చేస్తున్నాడని. నిన్న పవన్ కళ్యాణ్ కూడా బాబు మౌత్ పీస్‌లాగా అవే మాటలతో ఎటకారం చేశాడు. కుర్చీ కోసం చేయనన్నాడు. చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, పవన్, జగన్‌లలో ఏ ఒక్కరైనా సరే పదవి కోసం కాదు…..కేవలం ప్రజాసేవ కోసమే అంటే అంతకంటే పెద్ద బూతు ఇంకొకటి ఉండదు. అలా ఏ నాయకుడైనా చెప్తే నమ్మే జనాలు ఇంకా ఉన్నారంటే వాళ్ళను చూసి జాలి పడాల్సిందే. కాకపోతే మిగతావాళ్ళందరూ ప్రజాసేవ అన్న ముసుగు వేసుకుంటారు. కానీ జగన్ మాత్రం తనదైన శేలిలో డైరెక్ట్‌గానే చెప్తున్నాడు. ఇక జగన్ పాదయాత్ర ముఫ్ఫై రోజులు పూర్తి చేసుకుంది. ప్రజయోజనాలేంటంటే…..

ఈ రోజు చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ……ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీతో ……అలాగే చంద్రబాబు నిర్మిస్తానంటున్న ప్రాజెక్టులన్నింటినీ ప్రారంభించింది…..నిధులు కేటాయించింది ఎవరు? 2004కు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఇస్తున్న నిర్మాణాలు కూడా వైఎస్ నిర్మించినవి అన్న విషయం తెలియదా? వైఎస్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు…..ఆ తర్వాత అధికారంలోకి వచ్చి అమలు చేసిన హామీలనే ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నాడు. కాకపోతే వైఎస్‌ చిత్తశుద్ధితో అమలు చేశాడు. చంద్రబాబు ఎలా చేస్తున్నాడో మీడియా వార్తల్లో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన 108 ఉద్యోగిని ఎవరినైనా అడగండి. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పాలన ఎలా ఉందో తెలిసిపోతుంది.

ఇక ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్ర కావొచ్చు, ధర్నాలు, దీక్షలన్నీ సిఎం కుర్చీ కోసమేనా? రెండేళ్ళకో ఏడాదికో….అది కూడా తన షూటింగ్ గ్యాప్‌లో ప్రజల మధ్యకు వచ్చే పవన్‌ని చూసి భయపడి ఇప్పుడు చంద్రబాబు ప్రజలను మెప్పించడం కోసం తాయిలాలు ఇస్తున్నాడా? లేక జగన్‌కి ఉన్న ప్రజాదరణను చూశా? కాపుల రిజర్వేషన్స్‌, నిరుద్యోగ భృతి సహా చంద్రబాబు ప్రకటిస్తున్న పథకాలున్నీ ఎందుకు చేపడ్తున్నాడు? ప్రత్యక హోదాని వదిలేసినా…..అప్పుడప్పుడు అయినా ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎక్కడ జగన్‌కి ప్రజాదరణ పెరిగిపోతుందో….జగన్ ఎక్కడ అధికారంలోకి వస్తాడో అన్న భయంతో కాదా? కాకపోతే పవన్ ఏదో చెప్తే చేసేశాను అని కలరింగ్ ఇవ్వడం బాబుకు అలవాటు… ఆ డ్రామాలతోనే తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను అని చెప్పుకోవడం పవన్‌కి అలవాటు. జగన్‌కి అలా డ్రామాలు ఇష్టం ఉండదు. అందుకే ఏదైనా నిజాయితీగా చెప్తాడు. ఒక్కసారి అధికారం ఇస్తే ముఫ్ఫై ఏళ్ళపాటు ప్రజలు తననే ఎన్నుకునే స్థాయిలో పరిపాలిస్తాననడాన్ని కూడా ఎద్దేవా చేశారు. అందులో తప్పేముంది. జనాల మెప్పు పొందకపోతే ఎవరైనా ఇంటికి పోవాల్సిందే. కానీ మెప్పు పొందాలి అని కోరుకోవడం తప్పెలా అవుతుంది? తనేమీ ఎవరి పార్టీనో గుంజుకునో….అధికారంలో ఉన్నవాళ్ళకు ఊడిగం చేస్తూ టైం పాస్ రాజకీయాలు చేస్తూనో పదవిని ఆశించడం లేదు కదా? కుర్చీ దక్కలేదన్న కారణంతో పార్టీని అమ్ముకున్న పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిలా కూడా చేయట్లేదుగా? పోరాడుతున్నాడు……తనకంటే రాజకీయ వ్యూహాల పరంగా, వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన, మహానటుడు, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు రాజకీయాలతో పరాజయం చూపించిన నాయకులతో పోరాడుతున్నాడు. అందులో భాగమే పాదయాత్ర కూడా. అందులో తప్పేం ఉంది? సాక్షి మీడియా వచ్చాకే భజన మీడియా సంస్థలు జీతాలు పెంచాయని ఆ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులే చాలా సార్లు చెప్తూ ఉంటారు. ప్రజా క్షేత్రంలో కూడా అదే వ్యవహారం. వైఎస్ జగన్ లాంటి బలమైన ప్రత్యర్థి లేకుండా ఉన్నట్టయితే ఆంద్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడుల విషయంలో ఆంద్రప్రదేశ్ నంబర్ ఒన్‌గా నిలిచింది. ఇక అవినీతిలో కూడా ఆంద్రప్రదేశ్‌ది అగ్రస్థానమే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. కేంద్రం నుంచి తెస్తామన్న ప్రత్యేక హోదాలాంటి హామీలకు మంగళం పాడేశారు. వైఎస్ జగన్‌లాంటి బలమైన నాయకుడు పోటీలో ఉంటేనే ఇన్ని అరాచకాలు నడుస్తున్నాయి. ఇక జగన్ లేకుండా ఉండి ఉంటే ఆంద్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉండి ఉండేవో ఒక్కసారి ఊహించుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -