Friday, March 29, 2024
- Advertisement -

ఆన్ లైన్ క్లాస్‍లు.. తిప్పలు పడుతున్న తల్లిదండ్రులు..!

- Advertisement -

కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న నిరుపేద, మధ్యతరగతి వారికి మరోసమస్య ఎదురవుతుంది. ఇప్పటికే డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ టైంలో కొన్ని విద్యాసంస్థలు ఆ నిరుపేద, మధ్యతరగతి వారిపై పడి సంపాధించాలని చూస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న విద్యాని అందిస్తామంటూ అకడమిక్ ఇయర్ స్టార్ చేశాయి. నిజానికి ప్రభుత్వం.. ఆగస్టు తర్వాత స్కూల్స్ ఓపెన్ చేయాలని భావిస్తుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆ రూల్స్ ని బ్రేక్ చేసి ఆన్ లైన్ క్లాసులు అంటూ విద్యాసంస్థలు మొదలు పెట్టాయి. ఇందుకోసం ఓ యాప్ ని క్రియేట్ చేసి ఆన్ లైన్ క్లాస్ లు చెబుతున్నారు. అయితే ఇందుకోసం లాగిన్ ఐడీ, పాస్ట్ వర్డ్ ఇస్తామని… అవి కావాలంటే ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలని కండీషన్ పెడుతున్నారు. డబ్బులు కట్టిన స్టూడెంట్స్ కి మాత్రమే క్లాసెస్ చెప్పడం, హోమ్ వర్క్ ఇవ్వడం చేస్తున్నారు. ఫీజ్ లేటుగా కడితే ఆదనంగా ఎక్కువ డబ్బులు వసులు చేసి ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు.

  • అయితే ఇక్కడ సమస్య ముఖ్యంగా డబ్బుతో కూడుకున్నది. ఇంత డబ్బు కట్టి కొన్నిసార్లు క్లాస్ రూమ్లో చెబితే కానీ అర్దం కానీ సెలబస్ ఇలా ఆన్ లైన్ ద్వారా చెబితి అర్దం అవుతుందా ?
  • మరో సమస్య అందరు ఇలా ఆన్ లైన్ క్లాస్ ల కోసం డబ్బులు కట్టలేరు. అలాంటి వారి పరిస్థితి ఏంటి ?
  • మరి ఆన్ లైన్ క్లాస్ వినాలంటే పిల్లలతో పాటు పక్కన తల్లి కానీ.. తండ్రి కానీ కచ్చితంగా ఉండాలి. వారికి ఏ పని ఉన్నా ఆపేసుకుని మరి ఇందుకు టైం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఆన్ లైన్ క్లాస్ వల్ల పిల్లలకు ఫోన్ అలవాటు అవుతుంది. ఇప్పటికే పిల్లలు ఫోన్స్ అలవాటు అయిపోయి.. మాట వినడం లేదు మోర్రో అని తల్లిదండ్రులు నిత్యం అంటూనే ఉన్నారు. ఈ ఆన్ లైన్ క్లాస్ వల్ల తప్పక ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది.
  • అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయని అనుకోలేం. ఇప్పటికి స్మార్ట్ ఫోన్ వాడని వారు ఉన్నారు. అలాంటి వారు ఆన్ లైన్ క్లాసులు ఎలా వింటారు ?
  • ఫోన్ కొనే సామార్దం లేని వాళ్ళు అసలు స్కూల్ ఫీజ్ ఎలా కడుతారు ?
  • ప్రభుత్వం చెప్పేవరకు అసలు స్కూల్ ఫీజులు పెంచొద్దు.. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటి పరిస్థితుల్లో కట్టలేం అంటే వారిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పింది.
  • కానీ కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాస్ లు వినకుంటే మీ పిల్లలు వెనకపడిపోతారు అని బెదిరిస్తూనే.. డబ్బులు వసులూ చేయడమే కాదు.. ఆదనంగా ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
  • ఇక ఇంట్లో ఆన్‌లైన్‌ క్లాస్‌లు రెగ్యులర్‌గా వినాలంటే ఇంటర్నెట్‌ డేటా ఖర్చును కూడా పేద విద్యార్థులు భరించలేరు. తక్కువలో తక్కువ ఒక ఆన్ లైన్ క్లాస్ కి 400 ఎంబీ డేటా ఖర్చు అవుతుంది. మొత్తంగా ఓ మూడు ఆన్ లైన్ క్లాసులు వింటే ఆ రోజుకు సంబంధించిన డేటా 1.5జీబీ మొత్తం అయిపోతుంది. మిగిత క్లాసులు కోసం మళ్లీ డేటా పాక్ వేసుకోవాల్సి వస్తోంది. అందుకు అదనంగా మళ్లీ డబ్బు ఖర్చు.
  • ఇక ఈ ఆనై లైన్ క్లాసెస్ అనేవి అందరికి కొత్తే. అది కొంత వింతగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపించరు.
  • పెద్ద పిల్లలు అవసరం కోసం క్లాసెస్ వింటారేమో.. కానీ చిన్నపిల్లలు ఇందుకు రోజు సహకరించడం అనేది చాలా కష్టం.
  • అంత కష్టపడి సింస్టమ్ ముందు కానీ.. ఫోన్ ముందు కానీ కూర్చుని క్లాస్ ఎన్ని రోజులు వింటారు. అలా వినడం వల్ల శారీరక , మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఉంటుంది.
  • కొంత మంది పిల్లలకు చిరు తిండ్లు ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది వీరు క్లాస్ ముందు కూర్చొని అదేపనిగా తినే అవకాశంఉంది. దీని వల్ల ఊబకాయం పెరిగి అనారోగ్యాలు రావచ్చు.
  • ఆన్‌లైన్‌ బోధనకు కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు ఉండాలి. కంప్యూటర్లు, పెద్ద ఎస్సైన్‌మెంట్లకు, స్మార్ట్‌ఫోన్లు యాప్‌ లకు సౌకర్యంగా ఉంటాయి. అవి ఎంత మంది కొనగలరు ?
  • ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పిల్లవాడు వ్యక్తిగా ఎలా పెరుగుతున్నాడు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన, శాస్తీయమైన దృక్పథం వంటివి అంచనా వేయలేము.
  • ఒక ఆరు నెలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం అనేది సరికాదు. మన దేశం ఇంకా ఇలాంటివి అలవాటు చేసుకోలేదు. ఇది తప్పు దారి.
  • అందరు ఆన్ లైన్ క్లాసులు డబ్బులు చెల్లించి వినలేరు.. ఇలాంటి సమయంలో కొందరు విద్యార్ధులు ఇది అవమానంగా తీసుకుని ప్రాణాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి ఘటన కేరళలో ఒకటి జరిగింది.
  • అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు వినని వారిని పక్కన పెడితే వినేవారికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ? ఇటివలే నిర్వహించిన ఓ సర్వేలో 37 శాతం స్టూడెంట్స్ మాత్రమే ఈ ఆ లైన్ క్లాసులకు ఓకే చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సౌకర్యం కష్టమేనని చెప్పారు. చాలామంది ఇండ్లలో ఆన్​లైన్ క్లాసులు వినేందుకు ప్లేస్ లేదని ఈ సర్వేలో చెప్పారు.
  • సో ఒక్క ఏడాది చదువును ఆపేస్తే.. పిల్లలకు వచ్చే నష్టం ఏం ఉంది ? ఓ ఏడాది లేటుగా మొదలు పెడుతారు. ప్రభుత్వాలు కూడా ఇవే చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఓ ఏడాది పాటు క్లాసులు బంద్ చేసింది. పిల్లల భద్రత ముఖ్యమని.. తల్లిదండ్రులపై భారం మోపడం తమకు ఇష్టం లేదని చెబుతున్నాయి.
  • సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలానే చేస్తే పోయేది ఏం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ కాలంలో చాలా మంది చదువుకున్నవారినే పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకు వారు ఏంతో కొంత చదువు చెప్పుకోగలరు. అందుకు కావాల్సిన పుస్తకాలు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి.
  • రోజు ఆన్ లైన్ క్లాసులు కాకుండా కొత్త విషయాలు చెబుతూ.. రెండు రోజులకు ఓ సారి చదువుకు సంబంధించిన విషయాలు తల్లిదండ్రులే చెప్పవచ్చు.
  • ఇక ఈ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి డబ్బులు వసులు చేసే విద్యాసంస్థలపైన కఠన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాలను కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ఆన్ లైన్ క్లాసులు లేకుండా చుడాలని.. తమ పిల్లలు ఓ ఏడాది ఆలస్యం కావడం వల్ల పోయేది ఏం లేదని అంటున్నారు.

దాదాపుగా 70 శాతం మంది తల్లిదండ్రుల బాధ ఇదే. డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో పిల్లలను తమను ఈ విద్యాసంస్థలు ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు. ప్రభుత్వం స్కూల్స్ కి అనుమతి ఇచ్చినప్పుడు పిల్లలను స్కూల్స్ కి పంపుతామని.. అప్పటి వరకు తమపై భారం వేయవద్దని.. విద్యాసంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు.

టిక్ టాక్ తీసేయకుంటే ప్రమాదమేనట.. జాగ్రత్త..!

తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి..!

పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దోచేసిన యువతి..!

ఇలా చేస్తే.. రికార్డ్ చేసినవి అక్షర రూపంలో పొందవచ్చు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -