Friday, April 19, 2024
- Advertisement -

తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి..!

- Advertisement -

పనిలో నిజాయితి ఉండాలి అంటారు. చేస్తున్న పని చిన్నాదా ? పెద్దదా ? కాదు. ఏ పని చేస్తున్న అందులో మనం ఎంత వరకు నిజాయితిగా ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే అతనిపై గౌరవం.. మర్యాద పెరుగుతుంది. అతను ఆ పనిలో విజయం సాధించడమే కాదు.. ఎంతో మందికి ఆదర్యంగా నిలుస్తారు. కొన్ని చోట్ల మోసాలు దారుణంగా జరుగుతూ ఉంటాయి.

కిలో చెక్కరకు వంద గ్రామాలు తగ్గించి మోసాలు చేయడం.. మంచి బియ్యంలో ఇతర రకం బియ్యం కలిపి అమ్మి మోసం చేయడం వంటివి ఈ సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. నిజాయితీ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఆఖరికి తాగే నీటిని విషయంలో కూడా మోసాలు అవుతున్నాయి. ఇలాంటి సమాజంలో నిజాయితీ కనిపించడం లేదు. ఇక ఈ కరోనా సమయంలో ఈ మోసాలు మరింత పెరిగిపోయాయి. డబ్బు ఎలా దోచుకోవాలి.. మోసం ఎలా చేయాలి అనే రితీలోనే ఎక్కువ సంఘటనలు కనిపిస్తున్న వేళ ఓ నిజాయితీ పరుడు తాజాగా సోషల్ మీడియాలో కనిపించాడు. అక్కడ అక్కడ నిజాయితీ పరులు ఉంటారని ఇతనిని చూస్తే తెలుస్తోంది.

అతను ఎవరంటే ? అతని పేరు ఏంటంటే రసూల్. ప్రొద్దుటూరులో ఇతను “తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి” అంటూ ఓ బోర్డ్ పెట్టి యాపిల్స్, అల్ల నేరేడు పండ్లు అమ్ముతున్నాడు. ఇంత నిజాయితీగా అమ్మడం చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి అతని బండిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంత నిజాయితీ అనేది బడా వ్యాపారంలో ఉందా ? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే బడా వ్యాపారంలో కూడా ఇంత నిజాయితీ ఉండదేమో. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. రసుళ్ కు సలాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

టిక్ టాక్ తీసేయకుంటే ప్రమాదమేనట.. జాగ్రత్త..!

ఇలా చేస్తే.. రికార్డ్ చేసినవి అక్షర రూపంలో పొందవచ్చు..!

పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దోచేసిన యువతి..!

నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -