Sunday, April 28, 2024
- Advertisement -

కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్

- Advertisement -

కాఫీ,టి విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అంతగా సేవించకూడదని చాలామంది చెబుతుంటారు. దీనికి క్లారిటీ ఇస్తూ ఓ పరిశోధన పత్రం రిలీజైంది. ఏది అతి చేయకూడదనే దాని అర్ధం. కాఫీ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. మరి డైలీ ఎన్ని కప్పుల కాఫీని ఎంజాయ్‌ చేయవచ్చు.

ఇప్పటికే జరిగిన దాదాపు 200 పరిశోధనలను పరిశీలించినప్పుడు రోజుకు మూడు నాలుగు కప్పులు లాగించినా ప్రాబ్లమ్ లేదని … అస్సలు కాఫీని సేవించని వారితో కంపేర్ చేసి చూస్తే వీరికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని తేలింది. అంతేనా.. చాలా రకాల జబ్బులు రాకుండా నివారించేందుకూ కాఫీ పానీయం ఎంతో మేలు చేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సౌతాంప్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ రాబిన్‌ పూలే అంటున్నారు.

లేడీస్ లో గర్భంతో ఉన్న వారు కాఫీ ఎక్కువగా తాగితే చేటు చేస్తుందని వీరు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాలేయానికి వచ్చే వ్యాధి సైరోసిస్, పార్కిన్‌సన్స్, డిప్రెషన్, ఆల్జైమర్స్‌ వంటి వ్యాధులకు కూడా కాఫీతో మేలు కలుగుతుందని ఈ సైంటిస్లులు చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే కాఫీని ఒక లెవెల్ లో తాగితే… ఆరోగ్యానికి హాని కలగదని ఈ రీసెర్చ్ సారాంశంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -