Monday, April 29, 2024
- Advertisement -

కొత్తగా తల్లి అయ్యారా? అయితే కొన్ని జాగ్రత్తలు

- Advertisement -

బిడ్డ అవసరాలు తీరుస్తూనే మిమ్మల్ని మీరు సంరక్షించుకోవలసిన సమయం ఇది.

నిద్ర లేకపోతే ఎవరికైనా విసుగు,చిరాకు,కోపం రావటం సహజం. పైగా కొత్తగా తల్లి అయిన వారికి విశ్రాంతి కూడా అవసరమే. అందుకే వీలు ఉన్నంతవరకు ఎక్కువగా నిద్ర పోవాలి. బిడ్డ మేల్కొని ఉన్నప్పుడు నిద్ర పోవటానికి సమయం ఉండదు. అలాంటప్పుడు బిడ్డతో పాటు మీరు కూడా పడుకోవాలి.

జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన సమయం. కానీ హార్మోన్ల సమతుల్యత కారణంగా 80 శాతం మంది తల్లులు మానసిక ఆందోళనకు గురి అవుతారు. పది శాతం మంది ఒత్తిడికి గురి అవుతారు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా సమస్యని కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ విధంగా రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

పిల్లలు నిద్రలోనే నవ్వుతూ ఉంటారు. అలాంటి వాటిని ఆస్వాదించండి. నలుగురితో మాట్లాడటం,వీలైతే పిల్లలకు మీరే స్నానం చేయించటం వంటి చిన్న చిన్న పనులను చేయటం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -