Monday, April 29, 2024
- Advertisement -

ఇలా చేస్తే సిగరెట్ తాగడం తప్పక మానేస్తారు!

- Advertisement -

సిగరెట్ తగుతున్నారా? అయితే అది ప్రమాదం అని తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నారా? సిగరెట్ పీల్చే ప్రతి గుటక వలన చాలా రకాల వ్యాధులను శరీరంలోకి ఇముడ్చుకుంటున్నారు అని అర్థం. మీరు తాగే సిగరెట్’లో వెలకొద్ది విషాలు, విషపూరిత లోహాలు మరియు కార్సినోజేన్’లు ఉంటాయి, ఇవి మానవులకు ప్రాణాంతకరం అని చెప్పవచ్చు.

మీరు త్రాగే సిగరెట్’లో అధిక మొత్తంలో బెంజీన్, పెస్టిసైడ్స్ మరియు గ్యాసోలిన్ వంటి ప్రమాదకర కారకాలన్ని ఉన్నాయి. అంతేకాకుండా శవాలను నిల్వ చేయటానికి వాడే ‘ఫార్మాల్డిహైడ్’ మీరు త్రాగే సిగరెట్’లలో ఉంటుంది. వీటితో పాటూ, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి లోహ మూలకాలన్ని ఉంటాయి. ఇవన్ని తెలిసి కూడా మీరు సిగరెట్ ఎందుకు త్రాగుతున్నారు?

సిగరెట్ మానేయాలని కోరిక ఉన్న వారు చాలా సార్లు ప్రయత్నించి విఫలం అవుతుంటారు. వారి కోసం ఇక్కడ కొన్ని సూచనలు తెలుపబడ్డాయి వీటిని అనుసరించటం వలన సిగరెట్ త్రాగటాన్ని తప్పక మానేస్తారు.

Also Read: భోజనం మధ్యలో నీరు తాగడం మంచిదా..? కాదా..?

చాలా మంది సిగరెట్ తాగటానికి అనువైన సమయంగా రాత్రి అని చెపుతుంటారు. ఈ సమయంలో సిగరెట్ ఎక్కువగా తాగుతుంటారు కారణం అలవాటు అని చెప్పవచ్చు. సిగరెట్ మానాలి అనుకునే వారిలో 95 శాతం మంది మానేయాలి అనుకుంటూ ఉంటారు కానీ మానటానికి ఇబ్బంది పడుతుంటారు కారణం అలవాటు. మీ మెదడు మత్తుమందుగా పిలవబడే నికోటిన్’కు అలవాటు పడింది. అంతేకాకుండా రాత్రి సమయంలో ఎక్కువగా తాగటం వలన ప్రతి రోజు సిగరెట్ తాగటానికి ప్రయత్నిస్తారు. ఆకస్మాత్తుగా మీరు సిగరెట్ మానటానికి కష్టమని చెప్పవచ్చు. నెమ్మదిగా తగ్గించటం వలన ఈ అలవాటు మానవచ్చు.

సిగరెట్ మానేయాలి అనుకునే వారికి ఇది సరైన చికిత్సగా పేర్కొనవచ్చు, ఇందులో ప్రణాలికబద్దంగా మాత్రమె మానేయగలం. నికోటిన్ సేకరణను మానేయటం వలన నిరుత్సాహానికి, విసుగులకు, డిప్రెషన్ మరియు చిరాకులకు గురవుతుంటారు. నికోటిన్ బదిలీ చికిత్సలను చేపించుకోవటం వలన ఒత్తిడి నుండి కొంత వరకైన ఉపశమనాన్ని పొందుతారు. నికోటిన్ గమ్, పాట్చేస్ వంటి వాటిని వాడటం వలన రెట్టింపు ఉత్సాహంతో మానేయటానికి అవకాశం ఉంది.

Also Read: మధ్యాహ్నం పడుకుంటున్నారా ?

సిగరెట్ మానేయటంలో భౌతిక కార్యకలాపాలు మరియు వ్యాయామాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. వ్యాయామాలను చేయటం వలన నికోటిన్ పైన దృష్టి తగ్గటమే కాకుండా, వాటి పైన కలిగే ఆకర్షణను కూడా తగ్గించి వేస్తాయి. తీవ్ర వ్యాయమాల వలన మంచి మార్పులు మాత్రమె కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. సిగరెట్ త్రాగటం వలన కలిగిన అధిక బరువు కూడా వ్యాయామాలను చేయటం వలన తగ్గుతుంది.

ఇలాంటి నియమాలను అనుసరించటం వలన త్వరగా సిగరెట్ మానేసే అవకాశం ఉంది. మీ చుట్టూ పక్కల ఉండే సిగరెట్ ప్యాకెట్, ఆష్ట్రే, లైటర్స్ మరియు అగ్గిపెట్టే వంటి వాటి అన్నిటిని భయట విసిరేయండి. వీటి వలన సిగరెట్ అలవాటు కలిగి ఉన్నారు అనే ఆలోచన మీలో కలుగదు.

Also Read: పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -