Friday, April 26, 2024
- Advertisement -

దుస్తులు తెల్ల‌గా మెరిసే చిట్కాలివిగో !

- Advertisement -

దుస్తుల‌పై ప‌డిన మ‌ర‌క‌ల‌ను వ‌దిలించ‌డం కాస్తా క‌ష్టంతో కూడుకున్న ప‌నే. తెల్ల దుస్తుల‌పై ప‌డిన మ‌ర‌క‌ల‌ను పొగొట్టాలంటే వాటితో యుద్ధం చేయాల్సిందే. ఈ క్రమంలో దుస్తులు వాటి మెరుపును కోల్పోతుంటాయి. అయితే, అలా వాటి రంగుల‌ను కోల్పోకుండా.. ఒక్క ఉతుకుతో తెల్ల దుస్తులు.. మెరిసే బ‌ట్ట‌ల చిట్కాలు మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.. !

ఎప్పుడైనా స‌రే తెల్ల బ‌ట్ట‌ల‌ను వీలైనంత వ‌ర‌కు వేరే రంగు దుస్తుల‌తో క‌లిపి నాన‌బెట్ట‌కూడ‌దు. ఉత‌క‌కూడ‌దు. దీని వ‌ల్ల వేరే రంగు దుస్తుల రంగులు తెల్ల దుస్తుల‌పై ప‌డే అవ‌కాశం త‌గ్గుతుంది. డిట‌ర్జెంట్ ను సైతం త‌క్కువ‌గా వాడాలి. డిట‌ర్జెంట్ అధికంగా వెసి దుస్తులు ఉతికితే వాటి స‌హ‌జ రంగుల‌ల‌ను త్వ‌ర‌గా కోల్పోతాయి. ఇక వెనిగ‌ర్‌తో బ‌ట్ట‌ల‌ను శుభ్రం చేస్తే అవి ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తాయి. మ‌రక‌లు ఉన్న చోట వెనిగ‌ర్ ఉప‌యోగిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఒక్కోసారి బుర‌ద కానీ మ‌రేదైన మీద ప‌డిన‌ప్పుడు మ‌ర‌క‌లు అధికంగా ఏర్ప‌డుతాయి. ఇలాంటి స‌మ‌యంలో బ్లీచింగ్ పౌడ‌ర్‌ను ఉప‌యోగించ‌డంతో మంచి ఫ‌లితాలు ఉంటాయి. బ్లీచింగ్‌, డిట‌ర్జెంట్ క‌లిపిన నీటితో దుస్తులు ఉతికితే మెరుస్తుంటాయి. తెల్ల దుస్తుల‌ను నీలి రంగు క‌లిపిన నీటితో ఉతికితే కూడా మెరుస్తుంటాయి. మ‌ర‌క‌లు పోకుండా ఉంటే వాటిపై నిమ్మ‌రసంతో రాస్తే పోతాయి. తెల్ల‌టి దుస్తుల‌ను శుభ్రంగా ఉంచేందుకు బేకింగ్ సోడా కూడా వాడ‌వ‌చ్చు.

ముంచుకొస్తున్న ముప్పు.. దేశంలో క‌రోనా కొత్త వేరియంట్

యూపీలో మరో దారుణం.. మహిళను బంధించి..

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -