Thursday, April 25, 2024
- Advertisement -

ముంచుకొస్తున్న ముప్పు.. దేశంలో క‌రోనా కొత్త వేరియంట్

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే, ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనా కొత్త వేరియంట్లు మ‌న దేశంలోనూ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. భార‌త్‌లో మ‌రో క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ వెలుగుచూసిన‌ట్టు తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

దేశంలో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్‌(SARS-CoV-2) జ‌న్యువుల‌ను శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశీలించారు. దీనిలో భాగంగా జీనోమ్ సీక్వెన్స్‌లో స‌రికొత్త‌ వేరియంట్ భార‌త్‌లో ఉన్న‌ట్టు గుర్తించామ‌ని క‌న్‌సోర్టియ‌మ్ ఆఫ్ జీనోమిక్స్‌(ఐఎన్ఎస్ఏసీఓజీ) తెలిపింది. దీనిని తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ధ్రువీక‌రిస్తూ వెల్ల‌డించింది. కాగా, దేశంలోని జీనోమిక్స్ ల్యాబ్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 771 వేరియంట్ల‌ను గుర్తించాయి.

వివిధ దేశాల్లో అధికంగా వ్యాపిస్తున్న ప్రమాదకరమైన వేరియంట్లు.. సౌత్ ఆఫ్రికా వేరియంట్‌, బ్రిట‌న్ వేరియంట్ లు కూడా దేశంలో గుర్తించారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లు ఉన్న‌ట్టు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. మ‌రోవైపు దేశంలో కొత్త కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 47,262 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 275 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.
యూపీలో మరో దారుణం.. మహిళను బంధించి..

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -