Monday, April 29, 2024
- Advertisement -

భూ కబ్జానా…. అక్రమ వ్యవహారమా…. భజనకు దక్కిన భరణమా పవన్?

- Advertisement -

ఏంటో పవన్ కళ్యాణ్…..ఏమీ మాట్లాడకుండా ఉన్నంత కాలం పబ్లిసిటీతో మేధావి అన్న పేరు తెచ్చుకోగలిగాడు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆవేశం ఉన్నవాడిగా కనిపించి యువతను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచీ మాత్రం అన్నీ అసలు రంగులే చూపిస్తున్నాడు. నాన్న వారసత్వం గురించి మాట్లాడే పవన్ అన్న (చిరంజీవి)వారసత్వం గురించి మాట్లాడడు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ సోనియాగాంధీకి పార్టీని ఎంతకు అమ్మేశాడో? ఎంతకు అమ్ముడుపోయాడో అన్న వివరాలు చెప్పడు. ఇక బాబు భజనసేనుడిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకాన్ని రక్తికట్టిస్తున్న పవన్ కళ్యాణ్ దక్కించుకుంటున్న వ్యక్తిగత లాభాల గురించి కూడా అస్సలు మాట్లాడడు.

పవన్ కళ్యాణ్ రెఫరెన్స్‌తోనే పూనం కౌర్‌కి బ్రాండ్ అంబాసిడర్ పదవి రావడం గురించి ఆ మధ్య చాలా పెద్ద ఇష్యూ అయింది. అయినా పవన్ స్పందించలేదు. ఇక ప్యాకేజ్ వ్యవహారాల గురించి ఏమీ మాట్లాడడు. చంద్రబాబు తప్పులపై అస్సలు స్పందించడు. ఓటుకు కోట్లు వ్యవహారంలో కూడా చంద్రబాబుని అడ్డంగా సమర్థించిన ఘనుడు పవన్. ఇప్పుడు రాజధానిలో సొంత ఇంటి నిర్మాణం వ్యవహారంలో మరోసారి బుక్కయ్యాడు పవన్. భజనసేనానికి దక్కుతున్న నజరానాల వైనం మరోసారి చర్చకు వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు…..స్టాఫ్‌కి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నా అని ఘనంగా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. నా చేతికి వాచీ కూడా లేదు అని చంద్రబాబు చెప్పుకున్న స్టైల్‌లోనే పవన్ కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఎకరా ఇరవై కోట్ల విలువైన చోట రెండెకరాల స్థలంలో ఇళ్ళు కట్టుకుంటున్నాడు. అంటే నలభై కోట్ల వ్యవహారం. ఈ భూమిని కేవలం నలభై లక్షలకు లింగమనేని ఎస్టేట్స్ వాళ్ళు పవన్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారట. దాని తాలూకూ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ లింగమనేని ఎస్టేట్స్ ఓనర్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే. భూ సేకరణలో ఈయనగారి ల్యాండ్ ఒక్క అడుగు కూడా పోకుండా బహు జాగ్రత్తగా సేకరణ కార్యక్రమం ముగించాడు చంద్రబాబు. అక్రమంగా కబ్జా చేసి నిర్మించారు అని కోర్టులు కూడా వ్యాఖ్యానించిన ఎస్టేట్‌ని తన అధికారిక భవనంగా మార్చేసుకున్నాడు చంద్రబాబు. ఆ రకంగా లింగమనేనికి చాలా సాయాలే చేశాడు. ఆ ప్రైవేట్ భవన మరమ్మత్తులకు కూడా కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును వెచ్చించాడు. మరి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏమని పిలవాలి? కబ్జా వ్యవహారాలనా? అక్రమమనా? అవినీతి అనా? పవన్ అత్యంత నిజాయితీపరుడు అని చెప్పేవాళ్ళు, పవన్ కళ్యాణ్ బాబు ఈ విషయంపై స్పందిస్తారా? ఏది ఏమైనా 2014 ఎన్నికల ముందు నుంచీ కూడా గట్టిగా 20-30 రోజుల పాటు ప్రజల ముందు యాక్ట్ చేసినందుకు……బాబుకు ఫేవర్ చేసినందుకు పవన్ బాబుకు నజరానాలు భారీగానే ముడుతున్నాయని సోషల్ మీడియాలో సెటైర్స్ ఓ స్థాయిలో పేలుతూ ఉండడం గమనార్హం.

షరామామూలుగానే ఇలాంటి అక్రమవ్యవహారాలేవీ పచ్చ మీడియాకు, పచ్చ జనాలకు అస్సలు వినిపించవు. వినిపించనట్టుగానే నటిస్తూ ఉంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -