Thursday, May 23, 2024
- Advertisement -

జ‌ర్న‌లిజం ఇంతేనా? విలువ‌ల‌ను కాల‌రాస్తున్న టీవీలు…

- Advertisement -

ప్ర‌జాస్వామ్యానికి నాలుగో స్తంభంగా జ‌ర్న‌లిజం (మీడియా) అని రాజ్యాంగంలో పేర్కొంటారు. అంత‌టి విలువ గ‌ల ఈ రంగం ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింది. జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను టీవీలు భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయి. టీవీలు త‌మ వ్యూల కోసం అడ్డ‌దారులు తొక్కుతూ జ‌ర్న‌లిజం విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇస్తున్నాయి. త‌మ టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకోవ‌డానికి లేని వివాదాలు సృష్టించ‌డం.. కొత్త కొత్త మార్గాల్లో వెళ్తూ జ‌ర్న‌లిజం అంటేనే ఏహ్య‌భావం వ‌చ్చేలా చేస్తున్నాయి. వ‌క్ర‌మార్గంలో ప‌య‌నిస్తూ అత్యున్న‌త‌మైన జ‌ర్న‌లిజంను భ్ర‌ష్టు ప‌డుతున్నాయి.

నెల రోజులుగా చూస్తున్నాం ఎవ‌రో సినీ విమ‌ర్శ‌కుడు, ఓ న‌టుడి మ‌ధ్య వీళ్లే గొడ‌వ‌లు సృష్టిస్తున్నారు. వీళ్లే వారి మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టించి టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకుంటున్నారు. అదేదో ప్ర‌జా స‌మ‌స్య మాదిరిగా.. అది లేకుండా దేశం నాశ‌న‌మ‌వుతుంద‌న్నంత మేర టీవీలు ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఒక్క‌సారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం కావాల‌ని ఆ వ్య‌క్తిని త‌మ స్టూడియోల‌కు పిలుపించుకొని ర‌చ్చర‌చ్చ చేస్తున్నారు. దీన్ని పావుగా వాడుకొని ఆ టీవీలు రెచ్చిపోతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌జ‌ల‌కు టీవీ ఆన్ చేద్దామ‌నుకుంటే భ‌య‌ప‌డేంత స్థాయికి దిగ‌జార్చారు. టీవీ పెట్టక‌పోతే ప్ర‌శాంతంగా ఉండేంత స్థాయికి వ‌చ్చింది.

ప‌నులు ముగించుకొని ప్ర‌శాంతంగా దేశంలో, రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకుందామ‌ని రిమోట్ ప‌ట్టుకొని టీవీ ఆన్ చేస్తే వీరి ర‌చ్చ మొద‌ల‌వుతుంది. దీనిపై అంద‌రూ విసుగెత్తారు. ఏమిట‌ది? ఆ గొడ‌వ ఎవ‌రికి అవ‌స‌రం? జ‌ర్న‌లిజం అంటే ఏమిటి? టీవీల్లో ప్ర‌ద‌ర్శించే అంశాలు ఇవేనా? ఇంకేం లేవా? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించుకునే స్థాయికి ఎదిగారు.

ఇదే కాదు రెండు, మూడు క్రైం సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాటిని కూడా బీభ‌త్సంగా చూపించేశారు. వాటితో ఎప్పుడేం జ‌రుగుతుంద‌నేంత వాళ్లు చేస్తున్నారు. ఈ విధంగా చేయ‌డంతో ప్ర‌జ‌లు టీవీల‌కు దూర‌మ‌వుతున్నారు. లేదా న్యూస్ చాన్న‌ళ్లు చూడ‌డం మానేసి సినిమాల, మ్యూజిక్‌ చాన్నాళ్లు చూస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. తెల్లారి పేప‌ర్లు చూస్తే ఆ అంశాలేమి ఉండ‌వు. అయినా వీళ్లు రాద్ధాంతం చేస్తూ ర‌చ్చరచ్చ చేశారు.
దీని ఫ‌లితంగా అంద‌రూ యూట్యూబ్ వైపు మ‌ళ్లుతున్నారు. జియో త‌దిత‌ర నెట్‌వ‌ర్క్ డాటా ఆఫ‌ర్ల‌తో యూట్యూబ్‌కు బాగా క్రేజీ ఏర్ప‌డింది. యూట్యూబ్‌లో ప‌లు చాన్నాళ్ల బాట ప‌డుతున్నారు. ఆ యూట్యూబ్‌లో కూడా ఇదే రాద్ధాంతం కూడా ఉండ‌డంతో ఇప్పుడు ప్ర‌శాంతంగా టీవీ చాన్నాళ్లు, ఫోన్లు బంద్ చేసి ప్ర‌శాంతంగా ఇంట్లో గ‌డుపుతున్నారు. ఆవిధంగా ఈ చాన్నాళ్లు మార్చాయి.

ఇంకా ఎక్క‌డ జ‌ర్న‌లిజం రంగానికి విలువ ఉంటుంది. ఆ అత్యున్న‌త విలువ‌ను దెబ్బ‌తీశారు. ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్ అంటే విలువ లేకుండాపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -