Monday, May 6, 2024
- Advertisement -

ఇంగ్లీష్ సినిమాల్లో సబ్ టైటిల్స్ తో ఇంగ్లీష్ నేర్చుకుని.. గూగుల్ లో జాబ్ కొట్టేసాడు

- Advertisement -
working class hero son google’s seattle office father labo

ఓ తండ్రి తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలనుకున్నాడు. కూలీ పని చేస్తూ తన కొడుకును చదివించడు. ఇప్పుడు ఆయన కొడుకు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాప్ట్‍వేర్ ఉద్యోగిగా భారీ ప్యాకేజీతో చేరాడు. ప్రస్తుతం అతను సియాటెల్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆ తండ్రి మాత్రం తన కూలి పనిని మాత్రం వదులుకోలేదు. కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నా తండ్రి మాత్రం కూలి పని చేస్తూ సాధారణ జీవనం గడుపుతున్నాడు. కష్టపడేతత్వానికి అలవాటు పడ్డ తనకి కూలికి వెళ్లడంలోనే ఆనందం ఉందంటున్నాడు ఆ ఆదర్శ తండ్రి. విషయంలోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని సోజత్‌కు చెందిన తేజారామ్‌ రోజు కూలీ. కొడుకు రామచంద్రను కష్టపడి చదివించాడు. హిందీ మీడియం విద్యార్థి అయిన రామచంద్ర ఇంగ్లీష్ సినిమాలో వచ్చే సబ్‌టైటిళ్లను చదువుతూ ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాడు. 12వ తరగతి అవ్వగానే ఐఐటీ-జేఈఈకి కోచింగ్‌ ఇప్పించాడు ఆ తండ్రి. అందుకోసం తెలిసినవారి వారందరి దగ్గరా అప్పులు చేశాడు.

అనుకున్నట్లే ఉన్నత చదువు చదివిన రామచంద్రను అదృష్టం వరించింది. ఏకంగా గూగుల్‌లోనే ఉద్యోగం లభించింది. సియాటెల్‌లో లక్షల్లో గడిస్తున్న రామచంద్ర ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అప్పులన్నీ తీర్చేశాడు. ఊళ్లో కొంత భూమి కూడా కొన్నాడు. ఇంటిని తల్లిదండ్రులకోసం సౌకర్యవంతంగా తీర్చిదిద్దాడు. అయితే తండ్రిని మాత్రం మార్చలేకపోయాడు. రోజూ కూలికి వెళ్లి రూ.100నుంచి 400 వరకు సంపాదిస్తూ ఆ తండ్రిని కొడుకు కూలికి వెళ్లొద్దని ఎంత వారించినా.. తనకు కూలిలోనే సంతోషం ఉంటుందంటున్నాడు తండ్రి. కొడుకును ఉన్నతుడిగా తీర్చిదిద్దిన తండ్రి.. తన తండ్రి ఇంకా కష్టపడకూడదనుకనే కొడునుకు చూసి స్థానికులు ముచ్చటపడుతున్నారు.

Related

  1. ఈ 10 క్వాలిటీస్‌ మీలో ఉంటే… ఇక అమ్మాయిలు వదలరు!
  2. 14 రూపాయలకే అన్ లిమిటెడ్ కాల్స్‌
  3. పాత నోట్లను RBI ఏం చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు!
  4. ఎయిర్ టెల్ బ్యాంకింగ్ ఆఫర్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -