Sunday, April 28, 2024
- Advertisement -

విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌నే అవ‌కాశం ఇచ్చారా..?

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిస్క‌రించి తొంద‌ర‌ప‌డ్డారా…? విశ్లేష‌కులు, రాజ‌కీయ నాయ‌కుల‌నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లు నిజ‌మేనా….? ప‌్ర‌జాస‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే వేదిక ఒక అసెంబ్లీ. మ‌రి అలాంట‌ప్పుడు వాటిని బ‌హిస్క‌రిస్తే ప్ర‌జ‌ల త‌రుపును ఎవ‌రు మాట్లాడ‌తారు…? అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాన్ని మాట్లాడ‌కుండా చేస్తున్నార‌నేది తెలిసిందే. దాన్ని షాకుగా చూపి స‌మావేశాల‌ను బ‌హిస్క‌రిస్తె జ‌గ‌న్‌పై కొంత వ్య‌తిరేక ప్ర‌భావం త‌ప్ప‌కుండా ఉంటుంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని చివ‌రి అస్త్రంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్పం పేరుతో పాద‌యాత్ర‌ను రాష్ట్రంలో ప్రారంభించారు.125 నియేజ‌క వ‌ర్గాలు ఆరునెల‌లు,3వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌యిన పాద‌యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది. అయితె ఇప్పుడు పాద‌యీత్ర‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అసెంబ్లీస‌మావేశాల‌ను బ‌హిస్క‌రించి జ‌గ‌న్ త‌ప్పు చేశార‌నె భావ‌న వ్య‌క్తం అవుతోంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల‌నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు,యువ‌కులు, మ‌హిళ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిస్క‌రించిన జ‌గన్‌పై వ‌స్తున్న విమ‌ర్శ లు ఎదుర్కొన్నా ప్ర‌జ‌ల‌ల్లో మాత్రం కొంత వ్య‌తిరేఖ భావ‌న వ‌స్తుంద‌న‌డంలో సందేహంలేదు. ఇప్ప‌టికె జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రువుతున్నారు. ఇది అధికార పార్టీకి అస్త్రం కాగా అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిస్క‌రించ‌డంద్వారా మ‌రో అస్త్రం దొరికింది. పాద‌యాత్ర‌కు న‌ష్టం క‌లిగించే విధంగా దాన్ని ఉప‌యేగించుకున్నారు.

అయితె జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌యి పాద‌యాత్ర ప్రారంభించింటె జ‌గ‌న్‌కు మ‌రింత క్రేజ్ పెరిగేది. అసెంబ్లీ స‌మాశాల‌ను బ‌హిస్క‌రించార‌న్న విమ‌ర్శ‌ల‌కు తావుండేది కాదు. పైగా ప్ర‌జ‌ల‌ల్లో జ‌గ‌న్‌పై మ‌రింత అభిమానం పెరిగేది. దాంతో పాటు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డేది. అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొని ప్ర‌తిప‌క్షానికి మాట్లాడె అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు అప్పుడు స‌మావేశాల‌ను బాయ్‌కాట్ చేసి పాద‌యాత్ర ప్రారంభించింటె దాని క‌థ వేరేలా ఉండు. ప్ర‌తిప‌క్ష‌వైసీపీ ఎంత స‌మ‌ర్థించుకున్నా స‌మావేశాల‌ను బ‌హిస్క‌రించార‌న్న అప‌వాదు మాత్రం ఉండ‌నే ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -