Friday, May 10, 2024
- Advertisement -

బాబు చేతకానితనంగా…… జగన్ సమర్థతగా చూడకూడదా?

- Advertisement -

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. పచ్చ పార్టీ జనాలు అంతకంటే ఘోరం. తమతో పాటు ప్రజలందరికీ కూడా పచ్చగానే కనిపించాలని అహర్నిశలూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ ప్రయత్నాన్ని అబద్ధాలతో భలేగా ప్రచారం చేసుకుంటున్నారు. భారత ప్రధాని మోడీతో పాటు ప్రపంచంలో ఎక్కడ ఎవరిని చంద్రబాబు కలిసినా కూడా ……‘ఆహా….చూశారా చంద్రబాబు గొప్పతనం……ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుస్తున్నాడు….చంద్రబాబు గొప్పోడు కాబట్టే అందరూ కూడా చంద్రబాబును కలుస్తున్నారు’ అని 1994 నుంచీ ప్రచారంతో హోరెత్తిస్తూనే ఉంది పచ్చ బ్యాచ్. ఇప్పుడు అదే చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చే దిక్కులేదు. జాతీయస్థాయి నాయకులు అందరికీ చంద్రబాబు కన్నింగ్ నేచర్ అర్థమయిపోవడంతో ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి.

చంద్రబాబు పరిస్థితి అలా ఉంటే జగన్ మాత్రం జాగ్రత్తగా జాతీయ స్థాయిలో పరిచయాలు పెంచుకుంటూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలు నెరుపుతూ ఉన్నాడు. తాజాగా వైకాపా ఎంపిలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించింది. ఈ రోజు వైకాపా ఎంపిలు అందరూ రాష్ట్రపతిని కలవనున్నారు. అదే రాష్ట్రపతి టిడిపి ఎంపిలకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తెరవెనుక కుమ్మక్కు కారణాలు ఉన్నాయని అపాయింట్‌మెంట్ తెచ్చుకున్న వైకాపా ఎంపిల గొప్పతనాన్ని చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం ఎద్దేవా చేస్తోంది. కంటికి కనిపించని విషయాలను పక్కనపెడితే కంటికి కనిపించే నిజం మాత్రం ఒకటి ఉంది. రాష్ట్రపతిని కలిసే ముందు……కలిసి వచ్చిన తర్వాత వైకాపా ఎంపిలు అందరూ కూడా కచ్చితంగా జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడతారు. అలాంటి అన్ని సందర్భాల్లో వైకాపా ఎంపిలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రత్యేక హోదా గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా రాష్ట్ర సమస్యలు జాతీయ మీడియాలో చర్చనీయాంశం అయ్యేలా చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన రాష్ట్రపతిని, కాంగ్రెస్ ప్రధానిని కలవలేదా? అయితే కలిసిన అన్ని సందర్భాల్లోనూ వైఎస్ అవినీతి అంటూ చంద్రబాబు జాతీయ స్థాయి మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. కానీ విజయసాయితో సహా వైకాపా ఎంపిలు మాత్రం ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు.

కాస్త పరిణతితో ఆలోచించే ఎవ్వరికైనా రాష్ట్రపతిని వైకాపా ఎంపిలు కలవడం తప్పుగా కనిపించదు. ఒకవేళ తప్పే అయితే కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రధాని, రాష్ట్రపతులను కలవడం కూడా తప్పే అవుతుంది. ఈ విషయం పచ్చ బ్యాచ్‌కి కూడా తెలుసు. కానీ పచ్చ బ్యాచ్ పచ్చ కామెర్ల సిద్ధాంత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవిశ్వాసం, ప్రత్యేక హోదా పోరాటం, రాష్ట్రపతి, ప్రధానులను కలవడం…….ఇలా ఏదైనా బాబు చేస్తే హీరోయిజం……. బాబు గొప్పోడు కాబట్టే వాళ్ళు అపాయింట్‌మెంట్ ఇచ్చారు అని గొప్పగా చెప్పుకుంటారు. అదే పని జగన్ చేస్తే మాత్రం విలనిజం అంటారు. అబద్ధాలను ప్రచారం చేసి జనాలను నమ్మించడంలో ఎంతైనా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడి అనుచర బ్యాచ్ కదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -