Saturday, April 20, 2024
- Advertisement -

ధోని పై ఆగ్రహంగా చెన్నై.. ఎందుకంటే..?

- Advertisement -

ఈసారి ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు.. తొలిమ్యాచ్ లో లక్కీగా గెలిచినా చెన్నై జట్టు ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓడిపోయింది.. మొదటి మ్యాచ్ లో ముంబై గెలిచినా ఆ తరవాత జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ మ్యాచ్ లలో దారుణంగా ఓడిపోయి చెన్నై అభిమానుల ఆగ్రహానికి గురైంది.. ఎప్పుడు టాప్ లో ఉండే త్రం కాస్త ప్రారంభమైన వారం రోజుల తరువాత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ టీమ్ ను, ముఖ్యంగా ధోనీని విపరీతంగా ట్రోల్ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై 15 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించడంతో చెన్నై జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. సగం జట్లు మూడు మ్యాచ్ లను పూర్తి చేయగా, మిగతా జట్లు రెండు మ్యాచ్ లను ఆడాయి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన చెన్నై జట్టు, ఆపై ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ లేకుంటే చెన్నై పరిస్థితి ఇదేనని, పాయింట్ల టేబుల్ లో జట్టు చివరి స్థానంలో ఉండటానికి ధోనీయే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

టీమ్ వైఫల్యంపై పలు మీమ్స్ కూడా సృష్టించగా, అవి వైరల్ అవుతున్నాయి. 2020 కరోనాను తెచ్చినట్టే, చెన్నై జట్టుకు ఘోర వైఫల్యాన్ని కూడా మోసుకుని వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ఈ మ్యాచ్ లలో ధోనీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడంపైనా విమర్శలు చెలరేగాయి. అయితే, మ్యాచ్ పరిస్థితిని బట్టి తన ఆలోచన మారుతుందని, తమ టీమ్ లో పలువురికి కరోనా సోకడం, క్వారంటైన్ లో ఉండాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్ లేకపోయిందని, మ్యాచ్ లు ఇంకా ఎన్నో ఆడాల్సి వున్నందున తదుపరి గేమ్ లలో సత్తా చాటుతామని ధోనీ సమర్ధించుకున్నా, విమర్శలు మాత్రం ఆగడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -