Thursday, April 25, 2024
- Advertisement -

కరోన వ్యాక్సిన్ పై పీటర్‌సన్‌ ట్వీట్, స్పందించిన మోదీ

- Advertisement -

కోవిషీల్డ్, కోవాక్జిన్ టీకాలతో కోవిడ్‌-19 పై యుద్ధం ప్రకటించిన భారత్, వాటిని పలు దేశాలకు సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ను దక్షిణాఫ్రికాకు పంపించింది. ఆ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్విటర్‌ లో తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ వ్యాక్సిన్లతో దక్షిణాఫ్రికాలో ల్యాండ్ అయిన విమానం ఫోటోను షేర్ చేశారు.

ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్‌సన్‌ దీనిపై స్పందించి భారత్ కృషి పట్ల ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేయగా.. ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. ‘భారత్‌పై మీరు చూపించే ప్రేమ, అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. ప్రపంచమంతా వసుధైక కుటుంబమని మేము ఎప్పుడూ బలంగా నమ్ముతాం. కరోనాపై పోరాటంలో భారత్ శక్తిని కూడదీసుకొని కీలక పాత్ర పోషిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన పీటర్‌సన్‌ తర్వాత ఇంగ్లండ్ వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ సాధించిన పలు విజయాల్లో పీటర్‌సన్‌ కీలక పాత్ర పోషించాడు.

ఉనికి చాటుకునేందుకు బీజేపీ నేతల అడ్డ‌దారులు!

కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు!

లవంగాలతో ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -