Thursday, May 2, 2024
- Advertisement -

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

- Advertisement -

మనం తినే పండ్లు మంచి రుచికరమే కాదు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.  ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి. ఇదొక డ్రైఫ్రూట్.. ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. దీన్ని కొంతమంది జల్దారు పండు అని, మరికొందరు ఖుబానీ  అని పిలుస్తారు. 

కాస్త తీపి.. వగరు గా ఉండే ఈ పండు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిలోక్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు  ఎండు ఆప్రికాట్ లో 158 మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను ఆప్రికాట్ అందిస్తుంది.

-అంధత్వాన్ని త్వరగా రానీయదు. ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉన్నాయి.  వీటి వల్ల వయసు మీద పడుతున్నందువల్ల వచ్చే దృష్టి సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి.

– ఈ పండ్లలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచుతుంది. అలాగే అధికంగా ఉండే ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది. అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది.

-చెవినొప్పికి ఆప్రికాట్ నూనె ఔషధంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.  రెండు మూడు చుక్కల ఆప్రికాట్ నూనె నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.

-గర్భిణికి ఎంతో అవసరమయ్యే ఇనుము ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో వైద్యుడితో సంప్రదించాకే ఆప్రికాట్లను తినడం ఎంతో మంచిది.

– ఉబ్బసం (ఆస్తమా), జలుబు, ఫ్లూ  లక్షణాలు  ఆప్రికాట్ తినడం వల్ల తగ్గుతాయని పరిశోధనలలో తెలిసింది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -