Tuesday, May 7, 2024
- Advertisement -

రిటైర్మెంట్ పై చివరిలో ట్విస్ట్ ఇచ్చిన గేల్…

- Advertisement -

భారత్ తో వన్డే సిరీస్‌ అనంతరం గేల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన గేల్ న్యూటర్న్ తీసుకున్నారు. తూచ్ నేను అప్పుడే నేను రిటైర్మెంట్ అవ్వడంలేదని జట్టులోనే కొనసాగుతున్నాని చివరినిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో అర్ధశతకం బాదిన క్రిస్‌గేల్ (72: 41 బంతుల్లో 8×4, 5×6) తన దైన శైలిలో చెలరేగిపోయాడు. అయితే గేల్‌ ఔటైన తర్వాత భారత ఆటగాళ్లంతా అతణ్ని అభినందించడం, మైదానాన్ని వీడుతూ అతడు హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివాదం చేయడంతో గేల్‌కు ఇదే ఆఖరి మ్యాచ్‌ అని భావించారంతా…

కాని తాను ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పలేదని తాజాగా క్రిస్‌గేల్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. 2014లో ఆఖరిసారి వెస్టిండీస్ తరఫున టెస్టుల్లో ఆడిన గేల్.. ఐదు రోజుల ఫార్మాట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వెస్టిండీస్‌ తరఫున అత్యధిక వన్డేలు (301) ఆడడంతో పాటు ఆ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు (10,480) చేసిన క్రికెటర్‌గా గేల్‌ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో గేల్‌ 25 శతకాలు, 54 అర్ధశతకాలు బాదాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -