ఐసీసీపై రూల్‌పై బిగ్ బీ సెటైర్లు….

- Advertisement -

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన 12వ ప్రపంచకప్ ఫైనల్లో అదృష్టం త‌లుపుత‌ట్ట‌డంతో విజ‌యం ఇంగ్లండ్‌ను వ‌రించింది. అయితే ఇరు జ‌ట్లు స్కోర్లు స‌మ‌యం అవ‌డంతో ఫోర్ల ఆధారంగా ఇంగ్లండ్ జ‌ట్టు ఎక్కువ బౌండ్రీలు కొట్ట‌డంతో విశ్వ‌విజేతాగా ప్ర‌క‌టించింది ఐసీసీ. అయితే ఐసీసీ రూల్‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ రూల్‌పై బిగ్ బీ అమితాబ్ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.

మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే ??? ఐదు వంద‌ల నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంద‌ని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్‌ విలక్షణ నటుడు పరేష్‌ రావల్‌ సైతం ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. ‘ఎంఎస్‌ ధోని గ్లౌవ్స్‌ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్‌ ఓవర్‌ రూల్స్‌ మార్చుకుంటే బాగుంటుంది’ అని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -