Friday, May 3, 2024
- Advertisement -

ఆప్ఘ‌న్‌కు బిగ్ షాక్‌…ఆజ‌ట్టు స్టార్ ఆట‌గాడు టోర్నీకి దూరం…

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌కు బిగ్ షాక్‌ తగిలింది. గాయం కార‌ణంగా ఆ జట్టు బిగ్ హిట్టింగ్ ఓపెనర్, వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 32ఏండ్ల షాజాద్ పాకిస్థాన్‌తో వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అదే గాయంతో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాడు. దీంతో గాయం ఎక్కువ కావడంతో మిగతా టోర్నీకి దూరమయ్యాడు.

2015 వరల్డ్ కప్ నుంచి నిలకడగా ఆడుతూ ఆ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న షాజాద్ టోర్నీకి దూరమవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే. ఈ టోర్నీలో ఆప్ఘ‌న సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. అయితే మహ్మద్ షాజాద్ దూర‌మ‌వ‌డం ఆ జ‌ట్టు విజ‌యాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది.

2015 ప్రపంచకప్‌ నుంచి అఫ్గాన్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న షెహజాద్‌ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు. అతను అఫ్గాన్‌ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా బరిలో దిగే షాజాద్ చాలా వేగంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా చాలా మ్యాచ్‌ల్లో అతడు మెరుగ్గా రాణించాడు.

అతని స్థానంలో 18ఏండ్ల బ్యాట్స్‌మన్ ఇక్రం అలీ ఖిల్‌ను జట్టుకు ఎంపిక చేశారు. అఫ్గాన్ తరఫున ఇక్రం రెండే రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ జూన్ 8న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తలపడేందుకు సన్నద్ధమవుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -