Friday, May 3, 2024
- Advertisement -

స‌చిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ…

- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అండర్‌సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌(119)ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, సచిన్‌ (120ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

సునీల్‌ గావస్కర్‌(117 ఇన్నింగ్స్‌ల్లో) వీరందరికంటే టాప్‌లో ఉండగా, ఆ తర్వాత సెహ్వాగ్‌(121 ఇన్నింగ్స్‌ల్లో), ద్రవిడ్‌(125ఇన్నింగ్స్‌ల్లో)లు ఉన్నారు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 23 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2017లో శ్రీలంకతో దిల్లీ వేదికగా జరిగిన టెస్టులో అత్యధికంగా 243 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లోనే టెస్ట్‌ల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -