Friday, April 19, 2024
- Advertisement -

శ్ర‌మించిన భార‌త్ బౌల‌ర్లు..ఇంగ్లండు 246 ఆలౌట్‌…భార‌త్ 19/0

- Advertisement -

భారత్, ఇంగ్లాండ్ మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జ‌రిగిన నాలుగో టెస్ట్‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 76.4 ఓవర్లలో 246 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఈరోజు ఆట ముగిసే సమయానికి 19/0తో నిలిచింది. క్రీజులో శిఖర్ ధావన్ (3 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (11 బ్యాటింగ్) ఉన్నారు.

ఇంగ్లండ్ 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో కూరుకు పోయిన ఇంగ్లండ్‌ను అలీకి జత కలిసిన కుర్రాన్ వికెట్‌ను గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరును సాధించి పెట్టారు. ఓపెన‌ర్లు అంద‌రూ విఫ‌ల‌మ‌యినా కుర్రాన్ (78: 136 బంతుల్లో 8×4, 1×6) పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అతనికి ఆఖర్లో మొయిన్ అలీ (40: 85 బంతుల్లో 2×4, 2×6) చక్కటి సహకారం అందించాడు. దీంతో ఇంగ్లండు 246 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ పతనం తొలి పరుగుతోనే మొదలైంది. మూడో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ జెన్నింగ్స్‌ (0)ను బుమ్రా డకౌట్‌ చేశాడు. తర్వాత కెప్టెన్‌ రూట్‌ (4), బెయిర్‌స్టో (6), కుక్‌ (17), బట్లర్‌ (21), స్టోక్స్‌ (23) ఇలా 35 ఓవర్ల వ్యవధిలో 86 పరుగులకే ఆరుగురు కీలక బ్యాట్స్‌మెన్‌ ఔటయ్యారు.

ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కరన్‌… అలీకి జతయ్యాడు. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌నూ కుదుటపరిచారు. ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక మొయిన్‌ అలీని అశ్విన్‌ ఔట్‌ చేశాడు. రషీద్‌ (6) త్వరగానే ఔటైనా… బ్రాడ్‌ (17) అండతో కరన్‌ రెచ్చి పోయాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక ధాటిగా ఆడాడు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. వీరిద్దరు 63 పరుగులు జత చేశారు.పేసర్లు బుమ్రా (3/46), ఇషాంత్‌ శర్మ (2/26), షమీ (2/51)లతో పాటు స్పిన్నర్‌ అశ్విన్‌ (2/40) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -