Friday, April 26, 2024
- Advertisement -

విజృంభిస్తున్న భార‌త బౌల‌ర్లు…నాలుగో టెస్ట్‌లో క‌ష్టాల్లో ఇంగ్లండ్…

- Advertisement -

ఇంగ్లాండ్‌తో సౌథాంప్టన్‌ వేదికగా జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆథిద్య జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింది.భారత బౌలర్ల దాటికి ఇంగ్లిష్ బౌలర్లు క్యూ కడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ అందుకు మూల్యం చెల్లించుకుంటోంది. టీమిండియా బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు విసురుతున్నారు.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను వెంటవెంటనే ఔట్‌ చేస్తున్నారు. చాలాసేపట్నుంచి నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (17; 55 బంతుల్లో 3×4)ను హార్దిక్‌ పాండ్య పెవిలియన్‌ పంపించాడు. ఔట్‌స్వింగర్‌ను వెంటాడిన కుక్‌ స్లిప్‌లో విరాట్‌ కోహ్లీకి చిక్కాడు.24 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం బెన్‌స్టోక్స్ 12/41), జోస్‌ బట్లర్‌ (13/15తుల్లో) క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుని 15/2తో ఒత్తిడిలో నిలిచింది. ఓపెనర్ జెన్నింగ్స్ డకౌటవగా.. కెప్టెన్ జో రూట్ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు.ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన జెన్నింగ్స్ (0: 4 బంతుల్లో) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రూట్ (4: 14 బంతుల్లో)తో కలిసి ఓపెనర్ అలిస్టర్ కుక్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జో రూట్ కూడా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -