Friday, May 3, 2024
- Advertisement -

టెస్టుల్లో మ‌రో స‌చిన్ రికార్డును అధిగ‌మించిన విరాట్ కోహ్లీ..

- Advertisement -

భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ను దాటేశాడు. ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో 22 సెంచరీలను కోహ్లీ చేసినట్టు అయింది.

కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇది 22వ శతకం. కెప్టెన్‌గా అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ(15) మూడో స్థానంలో నిలిచాడు. 113 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ టెస్టుల్లో 22 శతకాలు సాధించాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 13వ ఇండియన్ క్రికెటర్ గానూ కోహ్లీ నిలిచాడు.

Image result for sachin

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కంటే వేగవంతంగా కోహ్లీ 22 శతకాలు సాధించాడు. 22 శతకాలు చేసేందుకు సచిన్‌ 114 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే కోహ్లీ 113 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. అలాగే ఇంగ్లాండ్‌ జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన 13వ భారత ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు.

తొలి టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోవడానికి 23 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. గురువారం రెండో రోజు మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకు 13 మంది భారత ఆటగాళ్లు మాత్రమే ఇంగ్లాండ్‌పై వెయ్యి పరుగులు సాధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -