Saturday, April 20, 2024
- Advertisement -

రైనా తొంద‌రేలా…?

- Advertisement -

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఏడాది తర్వాత.. మళ్లీ టీమిండియా జ‌ట్టులోకి వ‌చ్చాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన సురేశ్ రైనా చేసిన ప‌రుగులు త‌క్కువైనా అల‌రించాడు. (15: 7 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో తక్కువ స్కోరుకే వికెట్ చేజార్చుకున్నాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతినే కళ్లు చెదిరే రీతిలో సిక్సర్‌గా మలిచిన ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్.. ఆ తర్వాత రెండు ఫోర్లు బాది వికెట్ సమర్పించేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 175/9కే పరిమితమైంది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారి టీమిండియా తరఫున ఆడిన సురేశ్ రైనాపై వివిధ కారణాలతో సెలక్టర్లు మొండిచేయి చూపారు. మొదట ఫిటెనెస్.. ఆ తర్వాత ఫామ్ అంటూ పక్కన పెడుతూ వచ్చారు. అయితే.. ఇటీవల యో-యో టెస్టులో పాసైన రైనా.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 లీగ్‌లో మెరుపు శతకం బాది తన పునరాగమనానికి బాటలు వేసుకున్నాడు. కానీ.. తొలి టీ20 దొరికిన అవకాశాన్ని రైనా.. పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడని విమర్శలు వస్తున్నాయి.

ఏడాది తర్వాత దొరికిన ఛాన్స్.. జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కనీసం అర్ధశతకమైనా చేసుంటే.. బాగుండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ ఓ మెరుపు క్యాచ్ అందుకున్న రైనాకి.. మిగిలిన రెండు టీ20ల్లోనూ అవకాశం దక్కడం ఖాయం కనిపిస్తోంది. వాటిని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఎలా సద్వినియోగం చేసుకుంటే రైనా కెరీర్‌కు ఢోకా ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -