Thursday, April 25, 2024
- Advertisement -

మ్యాచ్‌పై ప‌ట్టు బిగిస్తున్న టీమిండియా…

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు తేనేటి విరామానికి 199/6తో నిలిచింది. కోహ్లీ ఔట్‌ కావడంతో కష్టాల్లో పడ్డ జట్టును అజింక్య రహానె (46; 57 బంతుల్లో 6×4) ఆదుకున్నాడు. ఓ వైపు ఆచితూచి ఆడుతూనే అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి పంపిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌ రేట్‌ 80.2గా ఉండటం గమనార్హం.

బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై ఇప్పటికే 192 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లి సేన. లంచ్ నుంచి టీ సమయం మధ్యలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 99 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లను రహానే, భువనేశ్వర్ సమర్థంగా ఎదుర్కొంటున్నారు.

కెప్టెన్ కోహ్లి 41 పరుగులు చేసి ఔటైనా.. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ప్రస్తుతం రహానే 46, భువనేశ్వర్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 వికెట్లకు 199 పరుగులతో ఉన్న టీమిండియా.. చివరి సెషన్‌లో ఎన్ని సాధ్యమైతే అన్ని పరుగులు పిండుకోవడమే చేయాల్సిన పని.

అస్థిరమైన బౌన్స్‌తో పిచ్ బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నది. మధ్యలో అంపైర్ల్లు కాసేపు ఆటను నిలిపేసి పిచ్ పరిస్థితిపై చర్చించుకోవడం గమనార్హం. ఇప్పటికే విజయ్, కోహ్లి, పాండ్యా, రహానేలు ఎగిసివస్తున్న బంతుల కారణంగా గాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -