Friday, May 10, 2024
- Advertisement -

సెంచరీతో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్..మ‌బ్బుల‌తో ఆట‌కు ఆంత‌రాయం..

- Advertisement -

సఫారీ గడ్డపై అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో కదం తొక్కాడు. 33వ ఓవర్‌లో మోరీస్ విసిరిన తొలి బంతినే బౌండరీ లైన్ ధాటించిన ధావన్ 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 13వ శతకం.

కోహ్లీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రహానే కూడా బ్యాట్ ఝుళిపిస్తుండటంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ఇదే రన్ రేట్‌ కొనసాగితే సునాయాసంగా 300 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ, వరుణిడి రూపంలో టీమిండియా జోరుకు అడ్డుకట్ట పడింది. 99 బంతుల్లో సెంచరీ చేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. దీంతో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది.

దట్టమైన మేఘాలు కమ్ముకొని, వెలుతురు మందగించడంతో ఎంపైర్లు ఆట నిలిపేశారు. ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు 34.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 107 (102 బంతుల్లో, 10×4, 2×6) రహానే 5 ​(8 బంతుల్లో, 1×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. సారథి విరాట్ కోహ్లీ 75 (83 బంతుల్లో, 7×4, 1×6) పరుగులు చేసి మోరీస్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -