Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీసేన‌తో జాగ్ర‌త్త …ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించిన కివీస్‌ పోలీసుల

- Advertisement -

మౌంట్ మౌంగనూయిలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించి రెండు మ్యాచ్‌లు మిగిలి ఉడ‌గానే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 244 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(62), కెప్టెన్ విరాట్ కోహ్లీ(60), అంబటి రాయడు(40 నాటౌట్), దినేశ్ కార్తీక్(38 నాటౌట్) రాణించడంతో లక్ష్యాన్ని 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

కివీస్ గడ్డపై భారత జట్టు విధ్వంసం సృష్టిస్తుండడంతో ఆ దేశ న్యూజిలాండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ పోలీసులు ఫేస్‌బుక్‌లో ఓ నోటీసు జారాచేశారు. కవీస్ జట్టును హెచ్చరిస్తూనే.. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఇది ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

‘ప్రజలకు పోలీసుల హెచ్చరిక. విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోంది. గతవారం నేపియర్‌, మౌంట్‌ మాంగనూలో అమాయకంగా కనిపించే కివీస్‌ జట్టుపై కనికరం లేకుండా దాడులు చేయడమే అందుకు సాక్ష్యం. క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ లాంటి వస్తువులను మీతో ఉంచుకున్నట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాల’ని పోస్టు పెట్టింది.

crciket

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -