Sunday, April 28, 2024
- Advertisement -

ఇద్ద‌రు తెలుగు క్రీడాకారుల‌కు ప‌ద్మ పుర‌స్కారాలు

- Advertisement -

దేశ ప్రతిష్టను నలుదిశలా ఇనుమడింపజేసిన ప్రముఖుల‌కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులకు ఎంపిక‌య్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి న‌లుగురు ప‌ద్మ అవార్డులు ద‌క్కాయి. క్రీడా విభాగం నుంచి మొత్తం తొమ్మిది మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.

చెస్ ఛాంపియ‌న్ ద్రోణ‌వ‌ల్లి హారిక‌, క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ సునీల్ ఛెత్రి, మౌంట్‌క్లైంబ‌ర్ బ‌చేంద్రిపాల్ ప‌ద్మ అవార్డుల లిస్ట్‌లో ఉన్నారు.

గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. 20 ఏళ్ల వయసుకే గ్రాండ్‌మాస్టర్‌ అయిన హారిక.. 2007-08 సంవత్సరానికి అర్జున అవార్డు గెలిచింది. ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్యాలు గెలవడంతో పాటు అంతర్జాతీయ టోర్నీల్లో మరెన్నో పతకాలు సాధించింది.

టీమిండియా మాజీ ఓపెనర్‌, 37 ఏళ్ల గౌతమ్‌ గంభీర్‌కు సైతం పద్మశ్రీ దక్కింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక, ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌… భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌లకు సైతం పద్మశ్రీ అవార్డులు లభించాయి.

మరోవైపు మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్‌ 1984లో మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించారు.

సికింద్రాబాద్‌లో పుట్టి ఇక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించిన భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ Padma Bhushan తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. గత ఏడాది వందో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి రికార్డులకెక్కిన ఛెత్రి.. 67 గోల్స్‌ కూడా సాధించాడు.

గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాను పద్మ శ్రీ వరించింది.

2016 కబడ్డీ ప్రపంచకప్‌ భారత్‌కు దక్కడంలో అజయ్‌ ఠాకూర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. తెలుగు వాడే అయినా, తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రపంచ స్థాయిలో మెరిసిన టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ శరత్‌ కమల్‌తో పాటు సీనియర్‌ ఆర్చరీ క్రీడాకారిణి బాంబేలా దేవి, భారత కబడ్డీ కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ పద్మశ్రీ దక్కించుకున్నారు.

క్రీడా విభాగంలో పద్మ పురస్కాలకు ఎంపికైంది వీరే
పద్మ భూషణ్‌: బచేంద్రీ పాల్‌ (ఉత్తరాఖండ్‌-పర్వతారోహణ)
పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌-చెస్‌); బజరంగ్‌ పూనియా (హరియాణా-రెజ్లింగ్‌); సునీల్‌ చెత్రి (తెలంగాణ-ఫుట్‌బాల్‌); గంభీర్‌ (ఢిల్లీ-క్రికెట్‌); ఆచంట శరత్‌ కమల్‌ (తమిళనాడు-టేబుల్‌ టెన్నిస్‌); బొంబేలా దేవి (మణిపూర్‌-ఆర్చరీ); ప్రశాంతి సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌-బాస్కెట్‌బాల్‌); అజయ్‌ ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌-కబడ్డీ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -