Friday, May 3, 2024
- Advertisement -

మ‌లింగ‌, కేదార్ జాద‌వ్ బౌలింగ్‌ను మిక్సీలో వేస్తే పుట్టిందే తివారీ బౌలింగ్‌….

- Advertisement -

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్‌ ఆటగాడు మనోజ్‌ తివారి. ఆట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి బౌలింగ్ యాక్స‌న్‌ను చూసిండ‌రు. యువరాజ్‌ సింగ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 2018 సీజన్‌కి లసిత్ మలింగ, కేదార్ జాదవ్ (గాయంతో) దూరమైనా.. వారిని ఒక్క ఓవర్‌ బౌలింగ్‌తోనే గుర్తుకు తెచ్చాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ మనోజ్ తివారీ. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. అనూహ్యంగా ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసేందుకు మనోజ్ తివారీ చేతికి పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బంతినిచ్చాడు. సగం మలింగ, సగం కేదార్ జాదవ్ బౌలింగ్ శైలిని మిక్స్ చేస్తూ భిన్నమైన శైలిలో బౌలింగ్ చేసిన మనోజ్ తివారీ.. ఆ ఓవర్‌లో 10 పరుగులిచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 132 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 119 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. హిట్టర్ యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మనోజ్ తివారీ (1).. బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అతను 5 బంతులాడి పేలవ రీతిలో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తివారీ బౌలింగ్‌పై సోషియ‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తివారి బౌలింగ్‌ చూస్తే నవ్వు ఆగడం లేదని.. ఇది మలింగా స్పిన్‌ వర్షన్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది సరైన బౌలింగేనా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌ను ఐపీఎల్‌లో అనుమతించ కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -