Friday, May 10, 2024
- Advertisement -

భార‌త్ ఖాతాలోకి మ‌రో ఆసియా క‌ప్..

- Advertisement -

యూఏఈలో జరిగిన ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా ఏడోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆసియా కప్‌ను గెల్చుకున్న పది రోజుల్లోనే… అదే స్థాయి టోర్నీలో… అంతకుమించిన ప్రదర్శనతో… టైటిల్‌ను కొట్టేశారు. చక్కటి ఆటతీరుతో మొదటినుంచి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన యువ భారత్‌… తుది సమరంలోనూ అదరగొట్టింది.

అండర్-19 ఆసియా కప్‌ను యంగ్ ఇండియా చేజిక్కించుకుంది.. ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 144 పరుగులతో తేడాతో లంకేయులను ఓడించింది. ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 85, అనూజ్ రావత్ 57తో తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు.

బంగ్లాపై మన సీనియర్ బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడి ఆడితే.. శ్రీలంకపై జూనియర్లు మాత్రం చెలరేగిపోయారు. మొత్తం మీద తుదిపోరులో శ్రీలంకపై 144 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అండర్ 19 ఆసియా కప్‌ను చేజిక్కించుకున్నారు. యంగ్ ఇండియా ఆసియా కప్‌ను గెలవడం ఇది ఆరోసారి.

అనంతరం కెప్టెన్ సిమ్రన్ సింగ్ 65, ఆయుషో బదోని 52 సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు చెందిన శ్రీలంక ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. ముఖ్యంగా హర్ష్ త్యాగి, సిద్ధార్థ్ దేశాయ్‌లు స్పిన్ మాయాజాలంతో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక 38.4 ఓవర్లలో 160 పరుగులకు అలౌట్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -