Friday, March 29, 2024
- Advertisement -

10 రన్స్ చేస్తే కోహ్లీ ఖాతలో మరో అరుదైన రికార్డు..!

- Advertisement -

టీమిండియా కెఫ్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు ముందు ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మరో 10 రన్స్ చేస్తే టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకోకున్నాడు. దాంతో టీ20ల్లో ఈ రికార్డు సాధించిన మొదటి భారత క్రికెటర్ గా విరాట్ చరిత్ర సృష్టించనున్నాడు.

మొత్తంగా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్ లో 181 మ్యాచ్‌లు ఆడి.. 5502 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా టీ20ల్లో 270 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 41.05 యావరేజ్‌, 134.25 స్ట్రైక్ రేట్‌తో 8990 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.

టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో క్రిస్‌గేల్(13296) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్(10370), షోయబ్ మాలిక్ (9926), బ్రెండన్ మెకకల్లమ్(9922), డేవిడ్ వార్నర్(9451), ఆరోన్ ఫించ్(9148) కోహ్లీ కన్నా ముందున్నారు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (8818) రన్స్‌తో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత సురేశ్ రైనా 8000 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మరో 8 సిక్స్‌లు కొడితే చెలరేగితే 200 సిక్సర్ల క్లబ్‌లో చేరనున్నాడు. ప్రస్తుతం 192 సిక్స్‌లు బాదిన కోహ్లీ.. నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ చెలరేగితే ఈ రెండు రికార్డులను అధిగమించవచ్చు.

విరాట్ కోహ్లి తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

అప్పుడు ట్రోల్ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా..?

ధోనీకి చివర్లో అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డాడో తెలుసా ?

ధోనీ-సురేష్ రైనా మధ్య గొడవలు.. అందుకు రైనా ఐపీఎల్ ఆడట్లేదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -