ధోనీ-సురేష్ రైనా మధ్య గొడవలు.. అందుకు రైనా ఐపీఎల్ ఆడట్లేదా ?

మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మధ్య ఎలాంటి ఫ్రెండ్‍షిప్ ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ లో సురేష్ రైనా ఆడట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంబర్ అయిన రైనా.. జట్టు తో కలిసి ప్రాక్టీస్ చేసి తిరిగి రిటర్న్ అయ్యాడు. యునైటెడ్ అరబ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇలా సడేన్ గా వెనక్కి రావడానికి వ్యక్తిగత కారణాలేనని చెబుతున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉన్న అసహనం, అసంతృప్తితోనే రైనా ఈ సీజన్ లో ఆడట్లేదన్న టాక్ వినిపిస్తోంది. తనకు కేటాయించిన రూమ్ విషయంలో రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడని, దాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో స్నేహితుడు ధోనీ సైతం పట్టించుకోలేదని అందువల్లే రైనా, ధోనీ మధ్య విభేధాలు వచ్చాయని నెటిజన్లు చెబుతున్నారు. మరి వీరిద్దరి మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయా ? లేక అవన్నీ రూమర్సేనా ? వంటి ప్రశ్నలు అభిమానులను తొలచి వేస్తున్నాయి. దానికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం మీదే సరైన సమాధానం లభించింది.

ధోనీతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని.. తమ మధ్య మంచి స్నేహం ఉందని సంకేతాలు పంపాడు సురేష్ రైనా. ధోనీ రైనా టీమ్.. అనే ట్విటర్ అకౌంట్ ఒకటుంది. ప్రత్యేకించి- ఈ ఇద్దరు క్రికెటర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా, వార్తలనైనా, స్కోరింగ్ షాట్లనైనా ఇందులో పోస్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్.. తాజాగా సురేష్ రైనా ఇందులో ధోనీతో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి లైక్ కొట్టాడు. దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోందని అభిమానులు భావిస్తున్నారు.

ఢిల్లీ ని క్రుంగదీసిన ఓటమి చాలక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి షాక్..!!

ధోని పై ఆగ్రహంగా చెన్నై.. ఎందుకంటే..?

ధోనీకి తన ఫామ్‌పై నమ్మకం పోయిందట : ఆకాశ్ చోప్రా

సన్ రైజర్స్ కు ఈసారి విలియమ్సన్ ఆడటం ఖాయమేనా..?

Related Articles

Most Populer

Recent Posts