కోహ్లీ చూసి నేర్చుకోండయ్యా: లక్ష్మణ్‌

- Advertisement -

వికెట్లు పడుతున్నా పరుగులెలా చేయాలో విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లకు సూచించాడు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ అద్భుతమని ప్రశంసించాడు. ఒక పక్క భాగస్వామ్యాలు నిర్మిస్తూనే స్కోరు వేగం పెంచాడని తెలిపాడు. ఈ మ్యాచులో తొలి 29 బంతుల్లో 28 పరుగులు చేసిన విరాట్‌ తర్వాత 17 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు.

విరాట్‌ క్రీజులోకి వచ్చినప్పుడు 3 వికెట్లు పడ్డాయి. భాగస్వామ్యాల అవసరం ఏర్పడింది. తొలుత పంత్ తర్వాత శ్రేయస్, హార్దిక్‌ పాండ్యాతో భాగస్వామ్యాలు నిర్మించాడు. అతడు క్రీజును ఉపయోగించుకొన్న విధానం నాకెంతో నచ్చింది. ఫీల్డర్ల మధ్య అంతరాలు ఎక్కడున్నాయో అతడికి తెలుసు. అందుకే అక్కడే షాట్లు ఆడాడు. కేవలం ఫోర్లే కాదు సిక్సర్ల వర్షమూ కురిపించాడు” అని లక్ష్మణ్‌ ప్రశంసించాడు.

- Advertisement -

పరిస్థితులను అర్థం చేసుకున్న కోహ్లీ తొలుత గాల్లోకి షాట్లు ఆడలేదని వీవీఎస్‌ తెలిపాడు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ బౌండరీలు, సిక్సర్లను మైదానం మొత్తం బాదేశాడన్నాడు. ఆఖర్లో మార్క్‌వుడ్‌, ఆర్చర్‌, జోర్డాన్‌ బౌలింగ్‌లో దూకుడు కొనసాగించడాన్ని తాను ఎంతగానో ఆస్వాదించానని లక్ష్మణ్‌ వెల్లడించాడు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎంత బడ్జెట్ ఎంత అంటే..!

తెలంగాణ నీటి బడ్జెట్ చూశారా.. అంతా లెక్కలే..!

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -