Friday, May 3, 2024
- Advertisement -

వరల్డ్ కప్ సెమీస్ ఇండియా, పాక్ మధ్యే…ఫ్యాన్స్ లెక్క‌లు

- Advertisement -

ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌కు ఏజ‌ట్టు వెల్తుంద‌నె లెక్క‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇప్ప‌టికే సెమీస్ చేరే నాలుగు జట్లలో మూడు జట్లకు ఇప్పటికే స్థానం ఖాయం కాగా.. నాలుగో జట్టు రేసులో మూడు దేశాలు పోటీపడుతున్నాయి. సెమీస్‌లో నాలుగో బెర్త్ ఎవ‌ర‌క‌నేది ఇంగ్లండ్ మ్యాచ్ పైనె ఆధార ప‌డింది. ఇంగ్లండ్ త‌న చివ‌రి మ్యాచ్‌ను న్యూజిలాండ్ తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్‌కు వెల్తుంది. ఓడితే టోర్నీనుండి త‌ప్పుకుంటుంది. అప్పుడు సెమీస్‌లో పాక్‌, బంగ్లాలో ఏదొక‌టి చేరుతుంది.

సెమీస్ లెక్క‌లు చూసుకుంటె..14 పాయింట్లతో సెమీస్ లో చేరగా.. ఆ తర్వాత భారత్ 11 పాయింట్లు న్యూజిల్యాండ్ 11 పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక నాలుగో స్థానానికి ఇంగ్లండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు పోటీపడుతున్నాయి. లీగ్ మ్యాచ్‌ల‌ను ప‌క్క‌న బెడితే..సెమీస్ లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంటుందని ఊహాగానాలకు తెరలేపారు. ఇప్పుడు నెట్టింట ఇదే చర్చ న‌డుస్తోంది.

ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న టీమిండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలతో తన చివరి రెండు మ్యాచ్ లనూ ఆడాల్సివుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉన్న భారత్, సంచలనాలు జరిగితే తప్ప, రెండు మ్యాచ్ లలోనూ విజయం ఖాయం. రెండు మ్యాచ్‌ల్లోను విజ‌యం సాధిస్తే భార‌త్ టాప్‌కు వెల్తుంది.ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే, 16 పాయింట్లతో టాప్ లో ఉంటుంది.

ఇక ఇంగ్లండ్ విష‌యానికి వ‌స్తే న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే మరే సమీకరణంతో సంబంధం లేకుండా ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అయితే, న్యూజిలాండ్ బలం ముందు ఇంగ్లండ్ తేలిపోతుందన్నది అభిమానుల అభిప్రాయం.

భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ 10 పాయంట్ల‌తో నాలుగో స్థానికి చేరుకోగా పాక్ 9 పాయంట్ల‌తో ఐదో స్థానానికి ప‌డిపోయింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలిస్తే 12 పాయంట్ల‌తో సెమీస్‌ను బెర్త్ ఖ‌రారు చేసుకుంటుంది.లేక‌పోతె త‌ప్పుకోవాల్సిందే.

ఇక పాక్ విష‌యానికి వ‌స్తే బంగ్లాతో చివ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్ 11 పాయంట్ల‌తో నాలుగో స్థానానికి చేరుతుంది. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఓడితేనె ఇది సాధ్య మవుతుంది. ఇప్పుడు పాక్ అభిమానులు కోరుకుంటున్నది ఇదే. అయితే, ఇక్కడ తన పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్ లతో బంగ్లాదేశ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లలో బంగ్లాదేశ్ గెలిచి, ఇంగ్లండ్ ఓడిపోతే పాకిస్థాన్ స్థానంలో బంగ్లా వచ్చి చేరుతుంది.

పాక్, ఇండియా జట్లతో పోలిస్తే బంగ్లా బలహీనం కాబట్టి, రెండూ గెలవడం కష్టమే. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఓటమినీ అంచనా వేయలేం. దీంతో సెమీస్ లో ఇండియా పాకిస్థాన్, ఒకవేళ ఆసీస్ టాప్ లో నిలిస్తే ఆసీస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు రెండో సెమీస్ ఇండియా – న్యూజిలాండ్ లేదా ఆసీస్ – న్యూజిలాండ్ (సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడి, భారత్ తన రెండు మ్యాచ్ లలో గెలిస్తే) మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7 పాయింట్లతో ఉన్న బంగ్లా రెండు మ్యాచ్ లు గెలిస్తే 11 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అయితే న్యూజిల్యాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడితేనే బంగ్లాకు చాన్స్.

ఒకవేళ బంగ్లాదేశ్ సెమీస్ కు వచ్చిందంటే, అప్పటికి ఇండియా, పాక్ లపై గెలిచివుంటుంది కాబట్టి, సెమీస్ లో ఆసీస్ తో పాటు ఇండియా, న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఉంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ గెలిస్తే, నెట్ రన్ రేట్ సెమీస్ రేస్ ను తేలుస్తుంది.

ప్రపంచకప్ సమరం మొత్తం ఇంగ్లండ్ గెలుపోటమిపై ఆధారపడి ఉంది. ఈనెల 3న బుధవారం ఇంగ్లండ్-న్యూజిల్యాండ్ మ్యాచే ఈ ప్రపంచకప్ సెమీస్ రేసును డిసైడ్ చేస్తుంది. ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. పాకిస్తాన్ బంగ్లా ఇంటికి చేరుతాయి. ఏదిఏమైనా మరోసారి చిరకాల ప్రత్యర్థులు తలపడితే ఈ వరల్డ్ కప్ పోటీలు మరింత మజాగా ముగుస్తాయని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -