Friday, May 24, 2024
- Advertisement -

శరవేగంగా మారుతున్న ఏపీ రాజ‌కీయాలు

- Advertisement -
Politics Speed up in andhra pradesh for 2019 elections

ఏపీలో రోజు రోజుకీ రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు క‌దులుతున్నాయి.ఎన్నిక‌లకు స‌మ‌యం ఉన్నా ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ,వైసీపీ,భాజాపా పార్టీలు త‌మ బ‌లాన్ని పెంచుకొనేక్ర‌మంలో వ్యూహాలకు ప‌దును పెడుతున్నారు.పార్టీ స‌మావేశాల‌ను ఇందుకు వేదిక‌గా చేసుకుంటున్నాయి.

ఉత్త‌రాదిన తిరులేని పార్టీగా ఉన్న భాజాపా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై క‌మ‌ళ‌ద‌లం క‌న్నేసింది. ముందుగా భాజాపా నాయకత్వం ఏపీలో పాగా వేయడంపై సైతం దృష్టి సారించింది. ఇప్ప‌టికే 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన అధినాయ‌క‌త్వం మ‌రింత దూకుడు పెంచుతోంది. టీడీపీతో పొత్తు కొన‌సాగుత‌న్న లోలోప‌ల మాత్రం సొంతంగా బ‌లాన్ని పెంచుకొనేందుకు వేగంగా పావులు క‌దుపుతోంది.జూలైలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కు విశాఖను వేదికగా నిర్ణయించడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పార్టీ విస్తరణ స్కెచ్ మొదలు పెట్టాలని బీజేపీ చూస్తోందని రాజ‌కీయ వ‌ర్గాలో చ‌ర్చించు కుంటున్నారు.
బీజేపీ దూకుడును గమనించిన టీడీపీ సైతం విశాఖలోనే తన పార్టీ పండుగ అయిన మహానాడును ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.ఎన్నిక‌ల స‌మ‌యానికి భాజాపా స‌న్నిహితంగా ఉండ‌క‌పోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నఉద్దేశ్యంతో బాబు సైలెంట్‌గా ఉన్నార‌నేది పార్టీ వ‌ర్గా భావ‌న‌.టీడీపీ సామ‌ర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దనే ఉద్దేశంతోనే విశాఖ వేదికగా మహానాడు నిర్వహణ అనే ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేసినట్లు వివరిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు విశాఖను వేదికగా నిర్ణయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం వ్యూహాత్మకంగా ముందుకెత్తోంది. పార్టీ మ‌హానాడును విశాఖ‌లో నిర్వ‌హించేంద‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.మ‌హానుడును పెద్ద ఎత్తున నిర్వ‌హించి భాజాపా దూకుడుకు చెక్ పెట్టాల‌నీ బాబు భాఇస్తున్న‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_custom,Side Ad 1}

విశాఖలో బీజేపకి ఎంపీ – ఎమ్మెల్యేలున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీని సైతం బీజేపీ గెలుచుకుంది. ఇదే ఊపుతో విశాఖ మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజార్టీ వార్డులు కొట్టేయాలని భాజాపా చూస్తోంది. అయితే బీజేపీకి ఎమ్మెల్సీ సీటును కేటాయించడం కిందిస్థాయి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సందు దొరికి న‌ప్పుడ‌ల్లా ఆపార్టీ నేత‌లు విష్ణ‌కుమార్‌రాజు, సోము వీర్రాజు టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
వైసీపీ అధినేత జ‌గ‌న్‌కూడా దూకుడును పెంచుతున్నారు.జూలైలో జ‌రిగే వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాల‌ను విజ‌య‌వాడ‌లో భారీగా నిర్వ‌హించేంద‌కు ప్లాన్ చేస్తున్నారు జ‌గ‌న్‌. ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు స‌మావేశాల‌కు వ‌చ్చేందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తున్నారు.ఇక్క‌డ నుంచే 2019 ఎన్నిల‌కు శంఖ‌రావం పూరించ‌నున్నారు.ప్లీన‌రీ స‌మావేశాల‌తోపాటు 13 జిల్లాలో పార్టీని సంస్థాగ‌తంగా ప‌టిస్టం చేయ‌బోతున్నారు.నియేజ‌క వ‌ర్గాల వారీగా…..గ్రామీణ‌.మండ‌ల‌,జిల్లాస్తాయిలలో పార్టీ ఎక్క‌డ బ‌ల‌హీనంగా ఉందో సొంతంగా స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు.
ఎన్నిక‌ల స‌మ‌యం రెండు సంవ‌త్స రాల స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే పార్టీల‌న్నీ త‌మ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టి సారించాయి. 2019 ఎన్నిక‌లు అన్ని పార్టీలు ప్ర‌తీష్టాత‌క‌మ‌రంగా మారాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -