ఆలీ భార్య హౌస్ లోకి ఎంట్రీ.. రాహుల్ ఏం చేశాడంటే ?

42653
Ali Reza Wife Enters in bigg Boss 3 House
Ali Reza Wife Enters in bigg Boss 3 House

బిగ్ బాస్ లో వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముందు నుంచి శ్రీముఖి, రాహుల్ కు పడటం లేదు. ఇక ఇటీవలే నామినేషన్ ప్రక్రియలో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక తాజా ఎపిసోడ్ లో కూడా వీరి మధ్య పెద్ద వార్ జరిగింది. తన పని తాను చేసుకుంటున్న శ్రీముఖి దగ్గరకు వెళ్లిన రాహుల్.. నీకు నామినేషన్ పక్రియ అర్దమైందంటూ రెచ్చగొట్టాడు. దాంతో చాలా సీరియస్ గా ఉన్న శ్రీముఖి.. నీ పని నువ్వు చేసుకో.. నీతో నేను మాట్లాడను.. అంటూ అతడిపై ఫైర్ అయింది.

రాహుల్ కూడా రెచ్చిపోయి.. నీతో మాట్లాడటం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని.. వెటకారంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక ఎప్పటిలానే బిగ్ బాస్ ఓ గేమ్ ఆడిస్తే.. ఇంటిలోకి కంటెస్టంట్స్ బంధువులని పంపి ఎమోషన్ అయ్యేలా చేశాడు. అంతకంటే ముందు బిగ్ బాస్ హౌస్ ని హోటల్ గా మార్చి.. హౌస్ మెంట్స్ తో ఫన్నీ టాస్క్ లు చేయించాడు. అనంతరం ఇంటి సభ్యులు స్పందించలేని స్థితిలో అంటే ఫ్రీజ్ – స్లీప్ – మూవ్ – ఫార్వర్డ్ మోడ్స్ లో పెట్టి.. వాళ్ల రిలేటివ్స్ ని ఇంట్లోకి పంపించారు.

ఈ నెపథ్యంలో మొదట వితికా చెల్లెలు రితికాని ఇంట్లోకి పంపించారు. ఆ టైంలో వితికా డ్రిల్ చేస్తుండగా.. చెల్లిల్ని చూసి భావోద్వేగానికి లోనైంది. తన చెల్లెల్ని పట్టుకుని తెగ ఏడ్చింది. ఇక క్రితికా తర్వాత ఆలీ భార్య మసుమ ఇంట్లోకి వచ్చింది. ఆ టైంలో ఇంటి సభ్యులు స్లిప్ మోడ్ లో ఉన్నారు. ఆలీ కూడా అలానే ఉన్నాడు. తర్వాత సడన్ గా ఎంట్రీ ఇచ్చిన మసుమ అలీని హగ్ చేసుకుని తెగ ఏడ్చింది. ఆలీ పక్కనే ఉన్న రాహుల్ ముసుమను పట్టుకుని ఎవరో అనుకుని జుట్టు లాగాడు.

Loading...