రామ్ చరణ్ స్థానంలో వచ్చిన నాగ చైతన్య

308
Ram Charan Replaced by Naga Chaitanya
Ram Charan Replaced by Naga Chaitanya

సినిమా కోసం ముందుగా ఒక హీరోని అనుకొని తర్వాత ఆ చిత్రం వేరే హీరో చేతిలో కి వెళ్లడం చాలా సందర్భాల్లో మనం చూసాం. అదే విధంగా మెగా హీరో చేయాల్సిన ఒక సినిమా ఇప్పుడు అక్కినేని హీరో చేతిలో పడింది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ చేయవలసిన ఒక సినిమాలో ఇప్పుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న మేర్లపాక గాంధీ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా తరువాత మేర్లపాక గాంధీ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారు. చెర్రీ కి కథ వినిపించి ఇంప్రెస్ కూడా చేశాడు.

కానీ రామ్ చరణ్ వేరే ప్రాజెక్టులతో చాలా బిజీ అయిపోవడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో వేరే హీరోను వెతుక్కుందామని నిర్ణయించుకున్న మేర్లపాక గాంధీ అక్కినేని యువ హీరో నాగచైతన్య కి కథ వినిపించాడు. నాగ చైతన్య కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒక ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం వెంకీ మామ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నాగచైతన్య తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మేర్లపాక గాంధీతో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

Loading...