సీఎం జ‌గ‌న్ నెల‌ పాల‌న‌పై జేసీ హాట్ కామెంట్స్‌…

369
JC Diwakar Reddy sentational comments on Jagan's month long rule
JC Diwakar Reddy sentational comments on Jagan's month long rule

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంతటా నయా సీఎం వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పైనె చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్ నెల‌రోజుల పాల‌న‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది అన్న అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. మెజారిటీ శాతం ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై సంతోషం వ్య‌క్తం చేస్తుంటె ఒక్క టీడీపీ వాల్లు మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె త‌న దైన మార్క్ పాల‌న కొన‌సాగిస్తున్నారు. ఈ నెల రోజుల్లో అనేక పథకాలకు రూపకల్పన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌య్యారు.

ఇందులో భాగంగానే జగన్ రైతు బంధు పధకం, అమ్మఒడి వంటి వాటిని ప్రవేశపెట్టారు. రోజుకో సంచనల నిర్ణయం తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలా వరసగా పధకాలు ప్రవేశ పెడుతున్న జగన్ పాలనా తీరుపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారని అదంతా అభినందనీయమే కానీ అవన్నీ మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. జ‌గ‌న్‌కు మ‌రికొంత స‌మ‌యం ఇవ్వాల‌ని సూచించారు. జగన్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొంత సమయం ఇచ్చి చూడాలని జేసీ అంటున్నాడు. గ్రౌండ్ స్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ ఇచ్చిన హామీలకు సంబంధించిన పధకాలు చురుగ్గా సాగడం లేదని జేసీ చెప్పుకొచ్చారు.

Loading...