Thursday, May 2, 2024
- Advertisement -

మహేష్ కు శత్రువుగా మారిన అల్లు అర్జున్.. ఎందుకు ?

- Advertisement -

అల్లు అర్జున్ కి ఇతర హీరోలతో మనస్పర్ధాలు రావడం కామన్ అయిపోయింది. రామ్ చరణ్ అభిమానులు కొంత కాలం బన్నీని వ్యతిరేకించారు. ఆ తర్వాత చెప్పను బ్రదర్ కామెంట్ తో పవన్ ఫ్యాన్స్ కి కూడా అతను శత్రువయ్యాడు. రీసెంట్ గా సైరా ప్రమోషన్స్ కి మాట సాయం కూడా చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యాడు. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి బన్నీపై చాలా కోపంగా ఉంది.

సంక్రాతికి సరిలేరు నీకెవ్వరు సినిమా రాబోతుండగా.. ఈ సినిమాకి పోటీగా అల వైకుంఠపురంలో రిలీజ్ డేట్ ప్రకటించడం.. వెంటనే మహేష్ సినిమాకి అదే డేట్ అనౌన్స్ చేయడం తెలిసిందే. మహేష్ బాబుకు కోఫం వచ్చిందని.. అందుకే అదే డేట్ ప్రకటించాడని క్లియర్ గా అర్దమవుతుంది. ఇదేదో అల్లు అర్జున్ చేసిన కవ్వింపు చర్య అని మహేష్ అభిమానులకి అనిపించింది. అంతే అతడిని వేసుకోవడం మొదలు పెట్టారు. మహేష్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడని అంటున్నారు.

ఇక మహేష్ వెయిటింగ్ లో పెట్టిన సుకుమార్ సినిమాని అల్లు అర్జున్ ఎగరేసుకుపోవడం మరోసారి చర్చకి వచ్చింది. అప్పట్లో అది సుకుమార్ తప్పిదంగా లెక్కగట్టిగా.. కానీ ఇప్పుడిది చూసి అది కూడా అల్లు అర్జున్ కావాలనే చేశాడని మాట్లాడుతున్నారు. ఇప్పటికే బన్నీకి యాంటిగా హీరోల ఫ్యాన్స్ ఉండగా.. కొత్తగా మహేష్ ఫ్యాన్స్ కూడా ఇందులో చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -