Friday, April 26, 2024
- Advertisement -

అయ్యో.. స్టార్ హీరోయిన్.. చివరికి ఇలా..

- Advertisement -
catherine tresa giving photo shoots for big offers

పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చి ఆఫర్ల కోసం బానే కష్టపడింది. కష్టానికి మంచి ఫలితమే దక్కింది. దాంతో ఈ భామకు వరస ఆఫర్లు వచ్చాయి. మంచి హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పెద్ద హీరోలతో నటించడానికి కూడా రెడీ అయ్యింది. అనుకున్నట్లు పెద్ద హీరోల సరసన నటించింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌తో ఏకంగా మూడు సినిమాలు చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఇదంత బానే ఉన్న.. స్టార్ హీరోయిన్లలాగే ఈమెకు దక్కాల్సిన ఫేమ్ దొరకట్లేదు. మంచి హీరోయిన్ గా.. బడా సినిమాల్లో నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం రావడం లేదు.

ఏదో మామూలు హీరోయిన్ గా సినిమాలోకి తీసుకుంటున్నారు తప్ప.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ భామ చేసేదేమీ లేక ఆమె ఫేమ్ కోసం చిన్న హీరోయిన్లు పాటించే.. ‘ఫోటోషూట్‌’ల పద్ధతినే ఫాలో అవుతోంది. దీంతో మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో.. ఇలా చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. క్యాథరిన్ ట్రెసా.. ‘చమ్మక్ ఛల్లో’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. అందులో మంచి ప్రతిభ కనబరిచి బేస్ట్ డెబ్యూట్ అవార్డ్ అందులుంది.

ఆ తర్వాత వరస ప్లాపులు చవి చూసింది. కానీ.. “రుద్రమదేవి”, “సరైనోడు” లాంటి భారీ సినిమాల్లో నటించి మళ్లీ పుంజుకుంది. ఈ రెండు హిట్లతో ఈమెకు స్టార్ హీరోయిన్ ఫేమ్ వస్తుందనుకున్నారు.. కాని అలా జరగలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘గౌతమ్ నంద’ సినిమాల్లో రెండో హీరోయిన్ గానే పాత్రలు పోషీస్తోంది. అందరిలాగే స్టార్‌డమ్ సంపాదించుకోవాలని తాపత్రయం పడుతుంటే.. దర్శకనిర్మాతలు మాత్రం ఈమెని సైడ్ హీరోయిన్‌గానే ఎంపిక చేసుకుంటున్నారు. మెయిన్‌ లీడ్‌ని హ్యాండిల్ చేస్తుందా? లేదా? అనే భయమో లేదో తెలీదు కానీ.. ఆ ఛాన్స్‌లు మాత్రం ఆమెకి ఇవ్వట్లేదు. దీంతో.. అందరి దృష్టిలో పడేందుకు ఈ భామ ‘ఫోటోషూట్’ మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే వరుసగా ఎన్నో ఫోటోషూట్‌లు ఇచ్చింది. తాజాగా మరొకటి ఇచ్చింది కూడా. మరి.. ఈ ప్రయత్నం అయినా ఆమె కెరీర్‌కి హెల్ప్ అవుతుందా? లేదా? వేచి చూడాల్సిందే.

{youtube}PpwCVCIt-rg{/youtube}

Related

  1. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  2. ప్రభాస్ కు సీక్రెట్ గా ఆ పని చేసినా స్టార్ హీరోయిన్.. ఎవరా హీరోయిన్..?
  3. యంగ్ హీరోతో.. స్టార్ హీరోయిన్ డేటింగ్.. అడ్డంగా పట్టుకున్న హీరోయిన్ భర్త
  4. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -