Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

- Advertisement -

మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మోనాల్ కు విపరితమైన క్రేజ్ ఏర్పడింది. అయితే బిగ్ బాస్ మొదలైనప్పుడు చప్పగా ఉండేది. తర్వాత టాస్క్ ఎక్కువగా రావడంతో షో ఆసక్తికరంగా మారింది. షోకి హైప్ క్రియేట్ కావడం వెనుక మోనాల్ ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పాలి.

ఇద్దరి అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉండడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఒకవైపు అభిజిత్ మరోవైపు అఖిల్ తో ఆమె వ్యవహరించే తీరు షోలో ఒక ప్రేమదేశం వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దానివల్ల అభిజిత్, అఖిల్ మధ్య గొడవలు పెరిగి తెలియకుండానే శత్రువులయ్యారు. మోనాల్ తన డ్రెస్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా రోజుకో హాట్ లుక్ తో కనిపిస్తోంది. అయితే మోనాల్ ఒక వారంకు 8లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అంటే రోజుకు లక్షకు పైగానే అందుకుంటుంది.

ఇప్పటికే షో మొదలై 30రోజులు దాటింది. చూస్తుంటే ఆమె ఇంకా మరో రెండు వారాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన గమనిస్తే ఆమె ఆదాయం ఏ రెంజ్ లో ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ఇక షోలో మొన్నటి వరకు లాస్య, నోయల్ కి అత్యధికంగా 7లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వచ్చింది. ఇక వారి తరువాత అభిజిత్, అఖిల్ కి 3లక్షల నుంచి 4లక్షల వరకు అందుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. వారందరికంటే మోనాల్ ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకుంటుందట.

స్కైప్‌కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి

గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

గ్లామర్ తో రచ్చ రచ్చ చేస్తున్న భాను శ్రీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -