శ్రీముఖికి చుక్కలు చూపిస్తున్న రాహుల్.. ఎందుకు ?

3385
Rahul Target to Sreemukhi
Rahul Target to Sreemukhi

బిగ్ బాస్ మూడో సీజన్ తుది దశకు వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సీజన్ ముందు నుంచి శ్రీముఖికి, రాహుల్ కి అసలు పడటం లేదు. వీరిద్దరి మధ్య ఎప్పుడు విభేధాలు వస్తునే ఉన్నాయి. ఆ విభేదాలను శ్రీముఖి ఎప్పటికప్పుడు పక్కకు పెటేసి మళ్లీ తన ఆట తాను ఆడుతోంది. కానీ ఇటీవలే రాహుల్ తో ఆమెకి జరిగిన చర్చ తీవ్రం అయింది.

నెం 2 వద్ద ఉన్న రాహుల్ ను నువ్వు అనర్హుడివి అంటు శ్రీముఖి వాదించింది. ఆ టైంలో రాహుల్ కూడా సీరియస్ అయ్యాడు. గయ్యాలి అంటూ శ్రీముఖిని అన్నాడు. అప్పటి నుంచి రాహుల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక నిన్నటి సినీ పాత్రల టాస్క్ లో కూడా రాహుల్ మరియు అలీలు శ్రీముఖిని టార్గెట్ చేశారు. నిన్నటి టాస్క్ లో శ్రీముఖి మహానటి సావిత్రి పాత్ర పోషించింది. ఆమె డాన్స్ చేసేందుకు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి హెల్ప్ కోరింది.

కానీ రాహుల్, అలీ ఒప్పుకోలేదు. రాహుల్, అలీ మినహా అందరు శ్రీముఖి టాస్క్ కు హెల్ప్ చేశారు. ఇక శ్రీముఖి చేసిన టాస్క్ బాగా హైలైట్ అయింది. ఇక తనకు హెల్ప్ చేయని రాహుల్, అలీలకు శ్రీముఖి కూడా హెల్ప్ చేయలేదు. గజినీగా నటించిన అలీకి శ్రీముఖి దూరంగా ఉంది. ఇక రాహుల్ టాస్క్ ను అసలు పట్టించుకోలేదు. రాహుల్ కూడా ఆమెని పట్టించుకోకుండా తన టాస్క్ తాను చేశాడు. వీరి మధ్య గొడవ రోజు రోజుకి పెరుగుతుందే తప్పా.. తగ్గట్లేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి అతనిని టార్గెట్ చేయడం వల్ల రాహుల్ అలా బిహేవ్ చేస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

Loading...