Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌భుత్వ‌ చ‌మురు కంపెనీల నుంచి పెట్రోల్‌,డీజిల్ కొన‌వ‌ద్ద‌ని నిర్న‌యించి బంక్‌ల య‌జ‌మానులు

- Advertisement -
Petrol pump owners in India have decided not to buy fuel from OMCs starting June 16

వాహ‌న‌దారుల‌కు మ‌రో షాక్‌.పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్‌ బంకుల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.16నుంచి ప్ర‌భుత్వ చ‌మురు కంపెనీల‌నుంచి పెట్రోల్‌,డీజిల్‌ను కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యించారు.

ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోల్‌ బంకుల యజమాన్య సంఘాలు తెలిపాయి. 

జూన్‌ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న ఐదు నగరాల్లో యజమానులు చేతులు కాల్చుకున్నారని.. దేశవ్యాప్తంగా అమలుపై పునరాలోచించాలని కోరారు.
దేశవ్యాప్తంగా సుమారు 57 వేల పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో 53 వేల బంకులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఇప్పుడు రోజువారి ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల‌ని చ‌మురు కంపెనీలు నిర్ణ‌యించ‌డంతో ఆందోళ‌న‌కు సిద్ద‌మ‌వుతున్నారు.ధరల సవరణను ప్రయోగాత్మకంగా మే 1 నుంచి పుదుచ్చేరి, చండీగఢ్‌, జంషెడ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, విశాఖపట్నంలో అమలు చేస్తున్నారు.స్టాక్‌ విలువ పడిపోతుందున్న భయంతో రోజువారీ ధరల సవరణకు డీలర్లు జంకుతున్నారు. తమకు కమిషన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. మ‌రో వైపు ఇలా చేస్తే చిల్ల‌ర అమ్మ‌కాల్లో ఒడిదుడుకులు చాలా త‌గ్గుతాయ‌ని పెట్రోలియం కంపెనీలు అంటున్నాయి. ముందుగాల‌నే వాహ‌న‌దారులు డీజిల్‌,పెట్ట‌రోల్ విష‌యంలో ముందు జాగ్ర‌త్త సుమా….!

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ఆయ‌న‌తో లంచ్‌ రూ. 16 కోట్లు….
  2. అంత‌రిక్షంలో శృంగారం అసాధ్యం….
  3. ఏటిఏంను.. ఇలా కూడా వాడోచ్చు అని తెలుసా..?
  4. క‌ల్తీమాఫియాకు కాదేది అన‌ర్హం….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -