Tuesday, May 7, 2024
- Advertisement -

క‌ల్తీమాఫియాకు కాదేది అన‌ర్హం….

- Advertisement -
Plastic Idly in chennai

హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే… ఇంతవరకు పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ కాకపోయినా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట నుంచి దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి.

బెంగులూరులో ప్లాస్టిక్ చెక్క‌ర వెలుగులోకి వ‌చ్చింది.ఇప్పుడు తాజాగా ప్లాస్టిక్ ఇడ్లీలు క‌ల‌క‌లం రేపుతున్నాయి.సాంబార్ లో ప్లాస్టిక్ వాడకపోయినా ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకం బయటపడింది.

{loadmodule mod_custom,GA1}

తాజాగా చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వెలుగులోకి వచ్చింది. అన్నానగర్, తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై బుధ, గురువారాల్లో ఆహార భద్రతాశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది.ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో 11 కిలోల ప్లాస్టిక్ షీటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని హోటళ్లలో ఇడ్లీలు ఉడికించే ప్రక్రియలో ప్లాస్టిక్ షీటును వినియోగించడం అధికారుల కంట పడింది. ఆయా హోటళ్ల నుంచి 6 కిలోల ప్లాస్టిక్ పేపర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో 5 కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది.

{loadmodule mod_custom,GA2}

నిజానికి ప్లాస్టిక్ పేపర్ తయారీలో కొన్ని రసాయనాలు వినియోగిస్తారని ఇలాంటి పేపర్ పై ఇడ్లీలు ఉడికిస్తే.. ఆ రసాయనాలు ఇడ్లీలలో కూడా కలిసే ప్రమాదముందని అధికారులు చెప్తున్నారు.ఇప్పుడు ప్ర‌జ‌లు ఏది తినాల‌న్న‌..కొనాల‌న్న బెంబెలెత్తిపోతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -