Thursday, May 2, 2024
- Advertisement -

అంబ‌టి ఎఫెక్ట్‌…స్పీక‌ర్ కోడెల‌పై కేసు న‌మోదు

- Advertisement -

ఎట్ట‌కేల‌కు సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఘటనతో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసును న‌మోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో కోడెలపై రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. కోడెల ఎన్నికల రోజు బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డరని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయ‌డంతో కోడెలను 7వ నిందితునిగా చేర్చిన పోలీసులు. ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈనెల 11న ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారని దాడులకు కారణం ఆయనేనని వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు హెచ్చరించారు. దీంతో కోడెల‌పై కేసును న‌మోదు చేశారు పోలీసులు.

ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై దాడి జరిగిందంటూ వార్త కలకలం రేగింది. ఇనిమెట్ల గ్రామంలో 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో కోడెల తలుపులు వేసుకుని గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారని అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు వైసీపీ నాయ‌కులు.

పోలింగ్ బూత్ లో తలుపులేసుకుని ఉండటంతో ఓటర్లు కోడెల శివప్రసాదరావుపై తిరుగుబాటుకు దిగారని ఓటర్ల తీరుతో సొమ్ముసిల్లి పడిపోయని కోడెల ఆ తర్వాత దాడి చేశారంటూ తమపై కేసులు బనాయించారంటూ ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -