Thursday, May 2, 2024
- Advertisement -

సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌… వైఎస్ఆర్‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంటారా..?

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌క్షాల‌ను చేయ‌డం ప్రారంభించారు. సీఎంవో లో బాబుకు అనుకూలంగా ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొనె దిశ‌గా అడుగులు వేస్తున్నారు. చట్టసభల నుంచి గ్రామపంచాయతీ వరకు అన్నింటా సంస్కరణ తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఎన్టీఆర్ బాట‌లోనె జ‌గ‌న్ న‌డుస్తున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌కు మండ‌లి రాజ‌కీయ పున‌రావాసంలా మారింద‌ని నాడు మండ‌లిని ర‌ద్దు చేసి సంల‌చ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ కూడా మండ‌లిని ర‌ద్దు చేస్తార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అందుకు మోడీ కూడా సై అన్నారా ? అంటే అవునంటున్నారు ఏపీ బీజేపీ నేతలు.

2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరించారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాసంగా మారిందనే కారణంతో ఎన్టీఆర్ రద్దు చేసిన మండలిని తన పార్టీ కాంగ్రెస్ నేతలకు కొలువులు ఇప్పించాలనే ఉద్దేశంతో వైఎస్ పునరుద్ధరించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా మండ‌లి కొనసాగుతూనె ఉంది.

ప్రస్తుతం మండలిలో ఉన్న 58 మంది సభ్యులలో వైసీపీ ప్రాతినిధ్యం కేవలం 8 మంది మాత్రమే. దీంతో భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందని జగన్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో మండలిలో మాత్రం మాజీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరంతా కీలక బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో సహజంగానే మెజారిటీ కలిగిన టీడీపీ ఇబ్బందులు సృష్టించే అవకాశముంది. దీంతో ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో పాటు ..వారంద‌రి రాజ‌కీయానికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లు అవుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వీరంతా భ‌విష్య‌త్తులో అసెంబ్లీకి ఎన్నిక కావ‌డం క‌ష్టమే.

ఇప్పటికే ప్రధాని మోడీని కలిసిన జగన్ ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. మోడీ మాత్రం జగన్ నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిసింది. త్వ‌ర‌లోనె మండ‌లిని ర‌ద్దు చేసె అవ‌కాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -