Friday, April 26, 2024
- Advertisement -

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం.. సర్వే లు అవే చెప్తున్నాయి..

- Advertisement -

తెలంగాణాలో ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ రాగ నవంబర్ 3 న ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి..  అయితే ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. ఇప్పుడు కూడా లేదు కానీ ప్రతిపక్షాలు తామంటే తాము టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్తూ గులాబీ నేతలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది.. ఎవరు తెలంగాణ లో ప్రతామ్నాయ పార్టీ అనేది ప్రజలు చూసుకుంటారు చేయాల్సిన పని చేయమని గులాబీ నేతలు అంటుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యం గా సాగిపోతూ ప్రజలను చిరాకు పెట్టిస్తున్నారు.. ప్రజల్లో ఎలాంటి బలం లేని కాంగ్రెస్ పార్టీ , ఒక్క నాయకుడు కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడడం టిఆర్ఎస్ నేతలకు నవ్వు తెప్పిస్తుంది..

ఇక గ్రేటర్ ఎన్నికల్లో తమదే గెలుపు అని ఖరాకండిగా చెప్తున్నారు తెరాస నేతలు.. ఇప్ప‌టికే శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేసిన కేసీఆర్ తాజాగా జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం ఎన్నిక‌ల‌పై ఆరా తీసిన‌ట్లు తెలిసింది. దుబ్బాక‌కు సంబంధించి మంత్రి హ‌రీశ్ రావు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌తో ఆయ‌న చ‌ర్చించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దుబ్బాక‌లో టీఆర్ఎస్ పాగా వేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ఆయ‌న అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేపై కూడా వారితో చ‌ర్చించిన‌ట్లు తెలిసింది.

ఈ సర్వే ఆధారంగా 94-104 సీట్లు టీఆర్ఎస్‌ గెలుచుకుంటుందని తెలుస్తుంది.. మొత్తం 150 డివిజన్లు ఉండగా సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఈ విషయాన్నీ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్ వీక్‌గా ఉందని చెప్పుకొచ్చారు. హస్తం పార్టీ రోజురోజుకు బలహీన పడుతోందని వివరించారు. బీజేపీపై మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడున్న సీట్లుకన్నా ఒకటి, రెండు సీట్లు పెరగొచ్చని జోస్యం చెప్పారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఊహించని స్థాయిలో సీట్లు వచ్చాయి. దాదాపు 99 సీట్లు టీఆర్ఎస్సే కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ధీమాను సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు.

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -